పెళ్లి బరాత్‌లో నాగినిలా ఊగిపోయిన మహిళ !! డ్యాన్స్ చూసి నవ్వుకుంటున్న నెటిజన్స్
కచ్చాబాదాం పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. పశ్చిమబెంగాల్‌కు చెందిన పచ్చిపల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ పాడిన ఈ పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది.
కచ్చాబాదాం పాట ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. పశ్చిమబెంగాల్‌కు చెందిన పచ్చిపల్లీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ పాడిన ఈ పాట సోషల్ మీడియాను ఓ ఊపు ఊపింది. ఈ పాటతో భుబన్ ఓవర్‌నైట్ సెలెబ్రిటీ అయిపోయాడు. ఇప్పటికీ ఈ పాట జోష్ తగ్గలేదు. ఏదో ఒక మూల ఈ పాటపై ప్రపంచవ్యాప్తంగా సెలెబ్రిటీలు, నెటిజన్లు స్టెప్పులేసి సోషల్‌మీడియాలో పెడుతున్నారు. తాజాగా ఓ మహిళ ఈ పాటపై నాగిని స్టెప్స్ వేసి అదరగొట్టింది. నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాలో ఓ యూజర్ అప్‌లోడ్ చేశారు. నీలిరంగు చీరలో ఉన్న మహిళ పెళ్లి బరాత్‌లో ఈ పాటపై నాగిని స్టెప్పులేసి అలరించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వైరల్ వీడియోలు
Latest Videos