ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయాడు !! సర్జరీ చేసి చేతులను అతికించారు
అవయదానం ఎంతోమంది బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. కళ్లు, కిడ్నీ, గుండె దానాల గురించి మనం ఇప్పటివరకు విన్నాం. రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి వాటిని అమర్చి పునర్జన్మ అందించింది ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆస్పత్రి వైద్యబృందం. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ 45 ఏళ్ల పెయింటర్ 2020లో జరిగిన రైలు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. తన చేతులను తిరిగి పొందేందుకు వైద్యులను సంప్రదించాడు.
అవయదానం ఎంతోమంది బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. కళ్లు, కిడ్నీ, గుండె దానాల గురించి మనం ఇప్పటివరకు విన్నాం. రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసి వాటిని అమర్చి పునర్జన్మ అందించింది ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆస్పత్రి వైద్యబృందం. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ 45 ఏళ్ల పెయింటర్ 2020లో జరిగిన రైలు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. తన చేతులను తిరిగి పొందేందుకు వైద్యులను సంప్రదించాడు. ఇటీవల బ్రెయిన్ డెడ్‌తో మరణించిన మహిళ చేతులను ఇతడికి విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. చేతులను, వేళ్లను కదిలించగలుగుతున్నాడని వైద్యులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సోదరి ఎగ్జామ్ కోసం సాహసం.. మంచులో ‘రోడ్డు’ వేసిన సోదరుడు
200 సార్లు టీకా వేయించుకున్న వ్యక్తి.. పరీక్షించి షాక్ తిన్న శాస్త్రవేత్తలు