Coconut in Flood: 15 లక్షల కొబ్బరికాయలు కొనసీమలో కళ్లముందే..

|

Aug 04, 2024 | 10:35 PM

డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు అవుతోంది. ఇందులో వేలాది ఎకరాలకు పైగా కొబ్బరి తోటలు లంక గ్రామాల్లోనే ఉన్నాయి. ఇక్కడ ప్రతి రోజూ కాయల దింపు జరుగుతూనే ఉంటుంది. రానున్న శ్రావణమాసం, వినాయక చవితి పండుగల నేపథ్యంలో కొబ్బరికి ఎక్కువగా ధర ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా రైతులు, వ్యాపారులు కొబ్బరిని ఎక్కువగా దాచుకున్నారు.

కోనసీమలో ముఖ్యమైన పంట కొబ్బరి. అక్కడ ప్రజల ఆర్థిక స్థితిగతులకు కొబ్బరే ఆధారం. రైతులతో పాటు వ్యాపారులు, కార్మికులకు బతుకు తెరువు చూపించే పంట ఇది. ప్రస్తుతం కొబ్బరి పంట వరద పోటుకు గురైంది. ఫలితంగా రైతులు తీవ్ర నష్టాలకు గురి కాగా వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు అవుతోంది. ఇందులో వేలాది ఎకరాలకు పైగా కొబ్బరి తోటలు లంక గ్రామాల్లోనే ఉన్నాయి. ఇక్కడ ప్రతి రోజూ కాయల దింపు జరుగుతూనే ఉంటుంది. రానున్న శ్రావణమాసం, వినాయక చవితి పండుగల నేపథ్యంలో కొబ్బరికి ఎక్కువగా ధర ఉంటుంది. ఈ నేపథ్యంలో కూడా రైతులు, వ్యాపారులు కొబ్బరిని ఎక్కువగా దాచుకున్నారు. దీంతో రైతులు దింపుకున్న కొబ్బరికాయలను ఇళ్ల వద్ద, పొలాల్లో రాశులుగా పోసి ఉంచుకున్నారు. లంక గ్రామాల్లో కొన్ని కోట్ల వరకూ కొబ్బరి కాయలు నిల్వ ఉంచారు. కోనసీమ జిల్లాలో లంక గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. కొబ్బరి కాయలు నీటిలో తడిసాయి. పాశర్లపూడిలంక గ్రామంలో రాత్రికి రాత్రే వరద ముంచేత్తడంతో 15 లక్షల కొబ్బరికాయలు నీట మునిగిపోయాయి. కొబ్బరి రాశులను వరద నీరు ముంచెత్తిందని… వాటి విలువ సుమారు కోటి 50 లక్షలు ఉంటుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరికాయల వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఈ వరద తమ కొంపముంచిందన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.