అభిమానికి మెగాస్టార్ భరోసా వీడియో
హీరోలపై ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానం చాటుకుంటారు. తమ అభిమాన హీరో సినిమా విడుదలైనప్పుడు థియేటర్ల వద్ద పెద్ద పెద్ద కటౌట్లు పెడతారు.. పాలాభిషేకాలు చేస్తారు. కొందరు తమ అభిమాన హీరోను కలుసుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైకిల్ యాత్రలు, పాదయాత్రలు చేస్తారు. అలా మెగాఫ్యామిలీకి వీరాభిమాని అయిన ఓ మహిళ ఏపీ నుంచి తెలంగాణకు సైకిల్ యాత్ర చేపట్టింది.
చిరంజీవి పుట్టినరోజున స్వయంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలపాలని సంకల్పంతో సైకిల్‌పై బయలుదేరి ఎట్టకేలకు చిరంజీవిని కలిసింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన రాజేశ్వరి మెగా ఫ్యామిలీకి వీరాభిమాని. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయనను కలిసి స్వయంగా శుభాకాంక్షలు చెప్పాలని కొన్ని వందల కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వచ్చి మెగాస్టార్‌ను కలిసారు. విషయం తెలుసుకున్న చిరంజీవి ఆమె అభిమానానికి, తనను చేరుకోడానికి ఆమె పడిన కష్టానికి చలించిపోయారు. రాజేశ్వరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు. ఆమె అంకిత భావానికి ముగ్ధుడైన చిరంజీవి ఆమెను ప్రశంసించారు. అన్నయ్యగా చిరంజీవికి రాఖీ కట్టిన రాజేశ్వరిని ఆడపడుచుగా భావించి ఆశీర్వదించి, అందమైన చీరను బహుమతిగా ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
ఏఐతో ఓ యూజర్ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..
వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో
17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
