Crocodile fair shocking video: సముద్ర తీరంలో మొసళ్ల జాతర.. ఒళ్ళు గగ్గురుపొడిచే వీడియో.. చూస్తే షాకే.

Updated on: Sep 18, 2022 | 8:51 AM

ఎలిగేటర్లు, మొసళ్ళు ఉభయచరాలు. నేలమీద, నీటిలోనూ కూడా ఇవి జీవిస్తాయి. మొసళ్లు నీటిలో ఉన్నప్పుడు అంతకు మించిన బలమైన జంతువు మరొకటి ఉండదు.


ఎలిగేటర్లు, మొసళ్ళు ఉభయచరాలు. నేలమీద, నీటిలోనూ కూడా ఇవి జీవిస్తాయి. మొసళ్లు నీటిలో ఉన్నప్పుడు అంతకు మించిన బలమైన జంతువు మరొకటి ఉండదు.ఎంతో ప్రమాదకరమై జంతువులైన మొసళ్ల దగ్గరకు వెళ్లడం అంటే మృత్యువుని కౌగిలించుకోవడం వంటిదే. సోషల్ మీడియాలో మొసళ్ళు కు సంబంధించిన అనేక రకాల వీడియోలను చూసి ఉంటారు . ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది.వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ సముద్ర తీరంలో వందలాది ఎలిగేటర్లు ఒడ్డు పొడవునా ఉన్నాయి. ఏదో జాతరకు హాజరైనట్టుగా అవి ఎంతో సందడి చేస్తున్నాయి. ఒడ్డు పైనే కాదు నీటిలో కూడా చాలా ఎలిగేటర్స్‌ ఉన్నాయి. అన్ని ఎలిగేటర్స్‌ని ఒక్కసారిగా చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అనుకోకుండా ఏదైనా జంతువు లేదా మానవుడు ఈ ప్రదేశంలో చిక్కుకుపోతే.. ఈ వందలాది ఎలిగేటర్ల మధ్య వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్క సారి ఊహిస్తేనే వణుకు పుడుతుంది. అందుకే అలాంటి ప్రాంతాలకు ప్రజలు వెళ్లడాన్ని నిషేధించారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్‌ షేర్‌ చేశారు. ఈ వీడియోను మిలియన్ల మంది ప్రజలు వీక్షించారు. లక్షల్లో లైక్‌ చేస్తూ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘కమ్ వాక్ ది బీచ్’ అంటూ కొందరు ఫన్నీ గా కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 18, 2022 08:51 AM