మేం మళ్లీ పెళ్లి చేసుకుంటాం.. హైకోర్టును ఆశ్రయించిన దంపతులు

|

Dec 14, 2022 | 8:43 PM

వైవాహిక జీవితానికి సంబంధించి హైకోర్టులో వింత కేసు విచారణకు వచ్చింది. ఆ దంపతులకు 2009లో వివాహం జరిగింది.. ఓ బాబు, పాప జన్మించారు..

వైవాహిక జీవితానికి సంబంధించి హైకోర్టులో వింత కేసు విచారణకు వచ్చింది. ఆ దంపతులకు 2009లో వివాహం జరిగింది.. ఓ బాబు, పాప జన్మించారు.. ఆ తర్వాత ఆ దంపతుల మధ్య విభేదాల కారణంగా 2015 నుంచి విడిగా ఉంటున్నారు.. పిల్లలను తాత, నాయనమ్మ దగ్గరకు పంపించి 2018లో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2019లో దంపతలిద్దరూ చట్టబద్ధంగా విడిపోయారు. విడాకుల తర్వాత కొత్త జీవితం ప్రారంభించాలని ఇద్దరూ అనుకున్నారు.. జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు ఎంతో మందిని కలిశారు. వారికి ఎవరూ నచ్చలేదు.. చివరకు ఆ మాజీ దంపతులు మళ్లీ కలిసి పోవాలని నిర్ణయించుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఓ జంట విడాకులు తీసుకున్న రెండేళ్ల తర్వాత తిరిగి కలిసి జీవించాలనే కోరికను వ్యక్తం చేస్తూ హైకోర్టు మెట్టెక్కారు. విడాకుల డిక్రీని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు తీర్పు వెలువరించింది. భార్యాభర్తల అంగీకారం, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కోర్టు కూడా డిక్రీని రద్దు చేయాలని ఆదేశించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడుస్తున్న రైలు నుంచి పెట్రోల్‌ చోరీ !! ప్రాణాలు పణంగా పెట్టి ??

ఎండలో జామ‌కాయ‌లు వృద్ధురాలు.. పోలీస్ అధికారి ఏం చేసాడంటే ??

హత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత సజీవంగా !!

ప్రేమించిన అమ్మాయికి ఊహించని ప్రమాదం.. ప్రియుడు ఏంచేశాడో తెలుసా ??

కోడి పుంజుకు లిఫ్ట్ ఇచ్చిన బుడ్డోడు.. ఏంచేశాడో చూడండి !!

 

Published on: Dec 14, 2022 08:43 PM