హత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత సజీవంగా !!
కొంతకాలం క్రితం హత్యకు గురైన యువతి తాజాగా సజీవంగా కనిపించింది. అదికూడా హత్యానేరం కింద జైలుకి వెళ్లిన యువకుడి తల్లికే కనిపించింది. దాంతో విషయం పోలీసులకు చెప్పింది యువకుడి తల్లి.
కొంతకాలం క్రితం హత్యకు గురైన యువతి తాజాగా సజీవంగా కనిపించింది. అదికూడా హత్యానేరం కింద జైలుకి వెళ్లిన యువకుడి తల్లికే కనిపించింది. దాంతో విషయం పోలీసులకు చెప్పింది యువకుడి తల్లి. నిందితుడి తల్లి ఫిర్యాదుతో యుతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సినిమాను తలపించే ఈ సీన్ ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 2015లో ఉత్తరప్రదేశ్ అలీగఢ్ జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. దీంతో బాలిక తండ్రి 18 ఏళ్ల యువకుడు విష్ణుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి తన కూతురుని కిడ్నాప్ చేశాడని ఆరోపించాడు. దీంతో పోలీసులు విష్ణుపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. కొన్ని నెలల తర్వాత ఆగ్రాలో ఒక బాలిక మృతదేహం లభించింది. అది తన కుమార్తె మృతదేహమేనని ఆమె తండ్రి తెలిపాడు. ఈ నేపథ్యంలో విష్ణుపై హత్య కేసు కూడా నమోదు చేసిన పోలీసులు అతడ్ని జైలుకు తరలించారు. కాగా, తన కుమారుడు ఏ తప్పు చేయలేదని బలంగా నమ్మిన విష్ణు తల్లి, కుమారుడి హత్య కేసుపై దర్యాప్తును ఆమెనే స్వయంగా చేపట్టింది. కనిపించకుండా పోయిన బాలిక ఆచూకీ కోసం చాలా మందిని ఆరా తీసింది, పలు ప్రాంతాల్లో వెతికింది. ఎట్టకేలకు ఏడేళ్ల తర్వాత ఆమె శ్రమ ఫలించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమించిన అమ్మాయికి ఊహించని ప్రమాదం.. ప్రియుడు ఏంచేశాడో తెలుసా ??
కోడి పుంజుకు లిఫ్ట్ ఇచ్చిన బుడ్డోడు.. ఏంచేశాడో చూడండి !!
వీళ్లు మాములు దొంగలు కాదు సుమీ.. నిమిషంలో రూ.7 కోట్లు మాయం !!
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

