వీళ్లు మాములు దొంగలు కాదు సుమీ.. నిమిషంలో రూ.7 కోట్లు మాయం !!
ఇంగ్లండ్‌లో ఇటీవల ఓ హైటెక్ దోపిడీ జరిగింది. సెకన్లలో కోట్లు కొల్లగొట్టారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంగ్లండ్‌లో ఇటీవల ఓ హైటెక్ దోపిడీ జరిగింది. సెకన్లలో కోట్లు కొల్లగొట్టారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొద్దిరోజుల క్రితం ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ కౌంటీ బ్రెంట్‌వుడ్ రోడ్ సమీపంలోని ఓ ఇండస్ట్రియల్ యూనిట్‌లో కొందరు దొంగలు చొరబడ్డారు. అక్కడ ఉన్న ఐదు లగ్జరీ కార్లను చాకచక్యంగా కొట్టేశారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తుల్లో ఒకరు గేటు ఓపెన్ చేసి గేటు దగ్గర నిలబడ్డాడు. మిగిలినవాళ్లు ఎంచక్కా లోపలినుంచి తమ సొంతకార్లలో ఏదో అర్జంట్ మీటింగ్‌కు వెళ్తున్నట్టుగా చక చకా వెళ్లిపోయారు. ఆ కార్లను డ్రైవ్ చేసుకుంటూ కేవలం 60 సెకన్లలోనే అక్కడ నుంచి ఉడాయించారు. కాగా, ఆ దొంగలు ఎత్తుకెళ్ళిన లగ్జరీ కార్ల విలువ సుమారు 7 కోట్లు ఉంటుందని అంచనా. వాటిల్లో రెండు పోర్ష్, మెర్సిడెస్.. అలాగే ఒక మేబ్యాక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు ఈ దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొదల్లో దాగిన పులిని వీడియో తీస్తుండగా !! ఏం జరిగిందంటే ??
మూడు సింహాల వెనుక ధైర్యంగా అడుగేస్తూ మహిళ !! నెట్టింట వీడియో వైరల్
ఇదేం చికెన్ కుర్మా !! మండిపడుతున్న నెటిజన్లు
మరో ట్యాలెంట్‌ను పట్టేసిన టెక్ దిగ్గజం.. ఇతని టాలెంట్ చూసి నెటిజెన్స్ కూడా ఫిదా
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మంచుకొండల్లో అద్భుతం.. జోజి లా సొరంగం!
వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగలు..!
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?

