కోడి పుంజుకు లిఫ్ట్ ఇచ్చిన బుడ్డోడు.. ఏంచేశాడో చూడండి !!
ఓ చిన్న కుర్రాడు తన ఇంటిముందు చిన్న సైకిలుతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సైకిలుకి తను ఆడుకునే లారీ బొమ్మను ఓ పొడవాటి తాడుతో కట్టి అందులో ఏదో లోడ్ తీసుకెళ్తున్నట్టుగా అడుకుంటున్నాడు.
ఓ చిన్న కుర్రాడు తన ఇంటిముందు చిన్న సైకిలుతో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ సైకిలుకి తను ఆడుకునే లారీ బొమ్మను ఓ పొడవాటి తాడుతో కట్టి అందులో ఏదో లోడ్ తీసుకెళ్తున్నట్టుగా అడుకుంటున్నాడు. అక్కడ సమీపంలోనే ఓ బాతు, కోడిపుంజు ఆహారం కోసం వెతుక్కుంటూ మేత మేస్తున్నాయి. ఇంతలో ఆ బుడ్డోడికి ఓ ఐడియా వచ్చింది. అక్కడ మేత మేస్తున్న కోడిపుంజును తనతోపాటు తీసుకెళ్లాలనుకున్నాడు. అంతే వెంటనే ఆకోడి పుంజును పట్టుకొని తన లారీపై ఉంచాడు. తర్వాత సైకిలును నడిపించుకుంటూ తన ఇంటివైపు కదిలాడు. ఆ బుడ్డోడు అలా తనను లారీలో తీసుకువెళ్తుంటే ఆ కోడి పుంజు భలే ఎంజాయ్ చేసింది. అలా కోడిపుంజుకు బుడ్డోడు లిఫ్ట్ ఇవ్వగా బాతు వారి వెంట నడుచుకుంటూ వెళ్లింది. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఈ వీడియో చూసాక తన మూడ్ మారిపోయిందని, మనసుకు చాలా ప్రశాంతత కలిగిందని ఓ నెటిజన్ అంటే.. చిన్నారుల స్వచ్ఛమైన మనసును చూసి ప్రకృతి కూడా పులకించిపోతుందని మరొకరు కామెంట్ చేశారు. ఆ బాలుడు కోడి పుంజుకు లిఫ్ట్ ఇచ్చి తీసుకువెళ్తుండగా అతడి తండ్రి ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్లు మాములు దొంగలు కాదు సుమీ.. నిమిషంలో రూ.7 కోట్లు మాయం !!
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!
స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు.. పాముల్నే తింటుంది..
బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి వింత వ్యాధి
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!

