Viral Video: ఒక్కోసమాధిని తవ్వుతారు.. ఆ ఊర్లో వర్షాకాలం వస్తే ఇంతే.. కారణం తెలిస్తే షాకే..!

Viral Video: ఒక్కోసమాధిని తవ్వుతారు.. ఆ ఊర్లో వర్షాకాలం వస్తే ఇంతే.. కారణం తెలిస్తే షాకే..!

Anil kumar poka

|

Updated on: Jul 18, 2022 | 12:07 PM

వర్షాకాలం వస్తే చాలు.. ఆ ఊరిలోని జనాలు అంతా ఒకటవుతారు. స్మశానవాటిక దగ్గరకు వెళ్లి.. ఒక్కో సమాధిని తవ్వుతారు. అక్కడితో ఆగరు. శవాలకు నీళ్లు తాగిస్తారు. ఏంటి.! వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ..


వర్షాకాలం వస్తే చాలు.. ఆ ఊరిలోని జనాలు అంతా ఒకటవుతారు. స్మశానవాటిక దగ్గరకు వెళ్లి.. ఒక్కో సమాధిని తవ్వుతారు. అక్కడితో ఆగరు. శవాలకు నీళ్లు తాగిస్తారు. ఏంటి.! వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవునండీ ఇది నిజం. కర్ణాటక బీజాపూర్‌లోని కలకేరి గ్రామస్తులు.. ప్రతీ ఏడాది వర్షాకాలంలో సమాధులు తవ్వి.. శవాలకు నీళ్లు పట్టిస్తారు. దీనికి కారణం లేకపోలేదు. ఆ కథేంటంటే.!గత కొద్దిరోజులుగా దేశమంతా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే కర్ణాటకలోని కలకేరి గ్రామంలో మాత్రం ఒక్క చుక్క చినుకు కూడా కురవలేదు. దీనికి తమ గ్రామానికి ఉన్న శాపమే కారణమని నమ్మిన ఆ గ్రామస్తులు గత నెల రోజుల్లో చనిపోయిన వారి లిస్టును సిద్దం చేశారు. వారి కుటుంబీకులతో చర్చించి.. చనిపోయిన మీ ఆప్తుల దప్పిక తీర్చేందుకు సహకరించాలని కోరారు.అనంతరం వారి సమాధుల దగ్గరకు వెళ్లి.. తల దిక్కున ఉందో తెలుసుకుని.. రెండు అడుగుల గుంత తవ్వి.. పైప్ ద్వారా మృతదేహానికి నీటిని పట్టించారు. ఇలా 25 సమాధుల్లోని మృతదేహాలకు నీరు తాగించారు. అంతే! చిత్రంగా కొద్దిసేపటికే ఆ ఊర్లో చినుకులు పడటం మొదలయ్యాయట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Published on: Jul 18, 2022 12:07 PM