రైలు ప్రయాణంలో బ్యాగును పోగొట్టుకున్న ఓ ప్రయాణికురాలికి రైల్వే శాఖ పరిహారం చెల్లించాల్సిందేనని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. రైల్వే శాఖ సేవల్లో నిర్లక్ష్యం ఉందని పేర్కొంటూ బాధిత ప్రయాణికురాలికి రూ.1.08 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2016 లో జరిగిన చోరీ కేసులో తాజాగా తీర్పు వెలువరించింది. పరిహారం మొత్తాన్ని చెల్లించాలని సంబంధిత జనరల్ మేనేజర్ ను ఆదేశించింది. 2016లో ఢిల్లీకి చెందిన ఓ మహిళ మాల్వా ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీ నుంచి ఇండోర్ కు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో తన వెంట తీసుకెళ్లిన విలువైన బ్యాగు చోరీకి గురైంది. ఝాన్సీ, గ్వాలియర్ స్టేషన్ల మధ్య ఈ దొంగతనం జరిగినట్లు గుర్తించిన మహిళ.. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. బ్యాగులో రూ.80 వేల విలువైన వస్తువులు ఉన్నాయని తన ఫిర్యాదులో పేర్కొంది
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
IRCTC: ఎవరికైనా రైలు టికెట్ బుక్ చేస్తున్నారా.. అయితే ఈ న్యూస్ మీ కోసమే
Deepika Padukone: 2006లోనే దీపికా తెలుగు సినిమాలో యాక్ట్ చేసిందా !!
Health Insurance: ఆరోగ్య బీమాలో 6 కొత్త మార్పులు
సల్మాన్ కు పెళ్లి ఎందుకు కాలేదో ఇంటర్వ్యూలో చెప్పిన సల్మాన్ తండ్రి