Viral Video: పెళ్లిలో ఎప్పుడూ నాటకీయత ఉండటం సహజమే. ఎక్కువ సార్లు పెళ్లి కొడుకు వారి చిన్నచిన్న పట్టింపుల వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. తెలుగు సినిమాల్లో లాగా కరెక్ట్ గా తాళి కట్టడానికి ముందు పెళ్లిని ఆపండి లాంటి సీన్స్ ఇప్పటిదాకా తెరమీదే చూసి ఉంటాం. కానీ ఇలాంటి సీన్ రియల్ గా జరిగిందంటే మీరు నమ్ముతారా. అది కూడా ఇక్కడ పెళ్లికూతురు తన వివాహాన్ని రద్దు చేయటం పెద్ద షాకింగ్ విషయం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు వధువు పెళ్లిని ఎందుకు రద్దు చేసుకుంది? అసలు కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి..
వీడియోలో.. జయమాల సమయంలో వధువు వేదికపై తన కోసం బలమైన నిర్ణయాన్ని తీసుకోవడం మనం చూడవచ్చు. వరుడు పెళ్లి కూతురు మెడలో దండ వేశాడు. కానీ.. వధువు మాత్రం అందుకు నిరాకరించింది. ఎందుకిలా చేసిందని అని ఆమెను అడగగా.. అతడు నిరక్షరాస్యుడని, చదువుకోలేదు కాబట్టి తాను వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు తేల్చి చెప్పింది. బీఈడీ చదువుకున్న సదరు యువతి తనకు సమానమైన చదువు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు స్పష్టం చేసింది. మంచిగా చదువుకుని, తనతో ఇంగ్లీష్ లో మాట్లాడగలిగే యువకుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు కరాకండిగా చెప్పింది. ఈ విషయం విన్న అక్కడి వారు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
అసలు పెళ్లి నిశ్చయించటానికి ముందుగానే ఈ విషయం చెప్పొచ్చుకగా.. అలా ఎందుకు చేయలేదని అక్కడి గుంపులోని ఒక వ్యక్తి వధువును ప్రశ్నించాడు. దీనికి బదులిస్తూ.. తాను ఈ వివాహాన్ని ముందునుంచి వ్యతిరేకిస్తున్నానని, తన తండ్రి మాత్రం తన మాటను వినకుండా డబ్బు సమస్య వల్ల ఒత్తిడి తెచ్చినట్లు తెలిపింది. పెళ్లి పీటల వద్ద చివరి క్షణంలో వివాహాన్ని రద్దు చేసుకోవటం, వరుడికి ఇబ్బంది కలిగించటం విషయాన్ని పక్కన పెడితే.. సదరు యువతి ధైర్యంగా నిర్ణయం తీసుకోవటంపై అక్కడికి వచ్చిన వారు ఆమెను ప్రశంశించారు.
“బ్రేవో.. మంచి.. ధైర్యవంతురాలైన స్త్రీ .. ఐ సెల్యూట్.. ప్లీజ్ ఇతన్ని పెళ్లి చేసుకో.. నిరక్షరాస్యుడైన భర్త పనికిమాలినవాడు.. డబ్బు పర్వాలేదు.. కానీ మేధావికి సమానమైన అవగాహన అవసరం” అని ఒక నెటిజన్ ప్రశంశించారు. “ఈ అమ్మాయికి హ్యాట్సాఫ్. మనిషికి ఎంత సంపద ఉన్నా ముందు వచ్చేది విద్య. చదువుకున్న ఈ అమ్మాయి తనకోసం తాను మాట్లాడటం అభినందనీయం, పెళ్లి చేసుకోకూడదనే తన నిర్ణయంపై మొండిగా మాట్లాడటం అభినందనీయం. ఇది భారతదేశ పురోగతిని చూపుతుంది” అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని పంచకున్నారు. ఇలా అనేక మంది సదరు యువతి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ.. వ్యక్తిగత నిర్ణయాలకు విలువ ఇవ్వాలని, మహిళలను పాతరోజుల్లో లాగా కాకుండా వారి జీవితంపై నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని అనేక మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోని bridal_lehenga_designn అనే పేజీ ద్వారా Instagramలో అప్ లోడ్ చేశారు. దీనిని ఇప్పటి వరకు 40 వేలకు పైగా వీక్షించగా.. 1900 మంది సదరు యువతి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ వీడియోకు లైక్ కొట్టారు.
మరిన్ని వైరల్ వీడియోలు చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చదవండి..
Stock Market: వారాంతంలో లాభాల్లో ట్రేడ్ అవుతున్న కీలక సూచీలు.. కీలకంగా కంపెనీల ఫలితాలు..
Nellore District: అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థికి ఊహించని షాక్.. పరీక్షహాల్ లో ఇలా..