Running Bus: బస్సు నుంచి పడబోయిన యువతి.. ఆమె జుట్టు పట్టుకుని కాపాడిన కండక్టర్‌.

Updated on: Feb 05, 2024 | 4:43 PM

తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో ఒక యువతి కదులుతున్న బస్సు నుంచి రోడ్డుపై పడబోయింది. అప్రమత్తమైన కండక్టర్‌ ఆమె జుట్టు పట్టుకుని బస్సులోనికి లాగాడు. బస్సు నుంచి పడకుండా ఆమెను కాపాడాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈరోడ్ నుంచి మెట్టూరు వెళ్తున్న బస్సులో కొందరు ప్రయాణికులున్నారు. ఆ బస్సు చిత్తర్ సమీపిస్తుండగా దిగేందుకు ఒక యువతి డోర్‌ వద్దకు వచ్చింది.

తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లాలో ఒక యువతి కదులుతున్న బస్సు నుంచి రోడ్డుపై పడబోయింది. అప్రమత్తమైన కండక్టర్‌ ఆమె జుట్టు పట్టుకుని బస్సులోనికి లాగాడు. బస్సు నుంచి పడకుండా ఆమెను కాపాడాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈరోడ్ నుంచి మెట్టూరు వెళ్తున్న బస్సులో కొందరు ప్రయాణికులున్నారు. ఆ బస్సు చిత్తర్ సమీపిస్తుండగా దిగేందుకు ఒక యువతి డోర్‌ వద్దకు వచ్చింది. అయితే బస్సు ఒక్కసారిగా కుదుపు ఇవ్వగా డోర్‌ వద్ద ఉన్న ఆమె కదులుతున్న బస్సు నుంచి బయటకు పడబోయింది. బస్సు డోర్‌ ఫుట్‌బోర్డ్‌ వద్ద ఉన్న కండక్టర్‌ వెంటనే స్పందించాడు. బస్సు నుంచి పడబోయిన యువతి తల జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. ఆమెను బస్సులోకి లాగి కాపాడాడు. మరో ప్రయాణికురాలు కూడా సహకరించింది. అనంతరం స్టాప్‌ వద్ద బస్సు ఆగడంతో ఆ యువతి దిగింది. తనను కాపాడిన కండక్టర్‌కు ఆమె కృతజ్ఞతలు చెప్పింది. మరోవైపు ఆ బస్సులోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos