‘వామ్మో.. వాడు పెద్ద సైకో’వీడియో

Updated on: Jul 03, 2025 | 11:05 AM

పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న కోల్‌కతా గ్యాంగ్ రేప్ ఉదంతం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతడి వికృత ప్రవర్తన గురించి కాలేజీ యాజమాన్యానికి తెలిసినా, వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తోటి విద్యార్థులు, జూనియర్లు ఆరోపిస్తున్నారు. సౌత్ కలకత్తా లా కాలేజీలో చదువుతున్న 24 ఏళ్ల యువతిపై జూన్ 25న అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా, అతడి అనుచరులు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖోపాధ్యాయ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు వారిని జులై 1 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది. మనోజిత్ మిశ్రాకు నేర చరిత్ర ఉందని, విద్యార్థినులను వేధించడంలో అతడు ముందుండేవాడని తెలుస్తోంది. అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి స్నేహితులకు పంపడం, మహిళలతో ఏకాంతంగా గడిపిన క్షణాలను వీడియో తీసి షేర్ చేయడం, విద్యార్థినులను బాడీ షేమింగ్ చేయడం వంటివి అతనికి అలవాటని కాలేజీ వర్గాలు చెబుతున్నాయి.అతడిపై గతంలో లైంగిక వేధింపులు, దాడులు, బెదిరింపులకు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చినా కాలేజీ యాజమాన్యం వాటిని పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ముస్లిం సమాధి వద్ద ఆగే జగన్నాథుడి రథం..ఎందుకో తెలుసా?వీడియో

ఓవర్ థింకింగ్‌కు భగవద్గీత 5 పరిష్కారాలు వీడియో

ఆడుకుందామని గ్రౌండ్‌కి వెళ్లారు..అక్కడి కనిపించింది చూసి షాక్ వీడియో

శివాలయంలో అద్భుతం.. శివలింగంపై నాగుపాము వీడియో