పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలోని సెక్టర్ 11 ఏరియా. అందులో క్వార్టర్ నెంబర్ 111..! అక్కడ ఉన్న ఓ వల నుంచి వింత శబ్దాలు వచ్చాయి.అక్కడ స్టీల్ ప్లాంట్ అధికారి తన ఇంటికి పక్షుల బెడద ఎక్కువ కావడంతో వాటి నుంచి రక్షణకు వల ఏర్పాటు చేశారు. ఏమైందో ఏమో కానీ.. మంగళవారం ఉదయం ఆ వల దగ్గర నుంచి వింత శబ్దాలు రావడం గమనించారు. ఏంటా అని వెళ్లి చూసిన ఆయనకు గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఆ వలలో భారీ గోధుమ నాగుపాము చిక్కింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతంలోని సెక్టర్ 11 ఏరియా. అందులో క్వార్టర్ నెంబర్ 111..! అక్కడ ఉన్న ఓ వల నుంచి వింత శబ్దాలు వచ్చాయి.అక్కడ స్టీల్ ప్లాంట్ అధికారి తన ఇంటికి పక్షుల బెడద ఎక్కువ కావడంతో వాటి నుంచి రక్షణకు వల ఏర్పాటు చేశారు. ఏమైందో ఏమో కానీ.. మంగళవారం ఉదయం ఆ వల దగ్గర నుంచి వింత శబ్దాలు రావడం గమనించారు. ఏంటా అని వెళ్లి చూసిన ఆయనకు గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే ఆ వలలో భారీ గోధుమ నాగుపాము చిక్కింది. ఆహారం కోసం వచ్చి ఊహించని విధంగా వలలో చిక్కిన నాగుపాము బయటపడేందుకు విశ్వప్రయత్నం చేసి ఫలితం లేక అలసిపోయి నీరసించిపోయింది. అయితే మనుషులు తననెక్కడ చంపేస్తారోనని తనను తాను రక్షించుకునేందుకు లేని శక్తిని కూడదీసుకొని బుసలు కొట్టింది. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు.. స్నేక్ క్యాచర్ కిరణ్ కు కాల్ చేశారు. ఆయన హుటాహుటిన అక్కడకు వెళ్లి.. వల నుంచి పామును బయటకు తీసి రక్షించాడు. పాము శరీరమంతా వైర్లతో పూర్తిగా చుట్టుకుని ఉంది. దీంతో ఒక్కో వైరు తొలగించేసరికి దాదాపుగా 20 నిమిషాల సమయం పట్టింది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని.. ఎట్టకేలకు వలను కత్తిరించి ఆ పామును బయటకు తీశాడు కిరణ్ కుమార్. అనంతరం నీరసించిపోయిన పాముకు సపర్యలు చేసి, సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదలిపెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్ !!
హైదరాబాద్ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. ఎన్నేళ్ల జైలుశిక్షో తెలుసా ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్ హాస్టల్‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు