ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ ఓపెన్ చేసి చూడగా..

ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ ఓపెన్ చేసి చూడగా..

Phani CH

|

Updated on: Oct 07, 2024 | 6:57 PM

ఎన్ని చర్యలు తీసుకున్నా.. స్మగ్లింగ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. అక్రమార్కులకు కస్టమ్స్ అధికారులు దిమ్మతిరిగేలా చెక్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నా.. నిందితులు సరికొత్త విధానాల్లో స్మగ్లింగ్‌లకు పాల్పడుతూ చిక్కుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీ విమానాశ్రయంలో వెలుగుచూసింది.

ఎన్ని చర్యలు తీసుకున్నా.. స్మగ్లింగ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. అక్రమార్కులకు కస్టమ్స్ అధికారులు దిమ్మతిరిగేలా చెక్ పెడుతున్నారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి తనిఖీలు నిర్వహిస్తున్నా.. నిందితులు సరికొత్త విధానాల్లో స్మగ్లింగ్‌లకు పాల్పడుతూ చిక్కుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ఢిల్లీ విమానాశ్రయంలో వెలుగుచూసింది. ఓ మహిళా ప్రయాణికురాలు ఐ ఫోన్‌- 16 ప్రో మ్యాక్స్‌ ఫోన్లను దేశాలు దాటించేందుకు ప్రయత్నించి కస్టమ్స్‌ అధికారులకు చిక్కింది. 26 ఐ ఫోన్లను టిష్యూ పేపర్లలో ఉంచి అక్రమంగా తరలిస్తుండగా.. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో మంగళవారం అడ్డంగా దొరికిపోయింది. ఆ మహిళా ప్రయాణికురాలిని అదుపులోకి తీసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఆమె హాంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిందని.. ఈ క్రమంలో ఆమెను ఆపి చెక్ చేయగా.. ఈ విషయం బయటపడినట్లు తెలిపారు. వ్యానిటీ బ్యాగ్ లో టిష్యూ పేపర్లలో చుట్టి ఐఫోన్లను తీసుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కస్టమ్స్ డిపార్ట్‌మెంట్‌కు అందిన నిర్దిష్ట ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్ ఆధారంగా తనిఖీలు నిర్వహించి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని.. తదుపరి విచారణ జరుగుతోందని తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!

రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!

హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. ఎన్నేళ్ల జైలుశిక్షో తెలుసా ??

ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??

వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!