కలిసి మందు కొట్టారు.. పిల్లలిద్దరికీ పెళ్లి చేద్దామనుకున్నారు.. కట్‌ చేస్తే..

Updated on: Jun 23, 2025 | 8:28 PM

ఇరుగు పొరుగు ఇంట్లో ఉండే ఇద్దరు మహిళలు మంచి మిత్రులయ్యారు. రోజూ కలిసి భోజనం చేయడం, మందు కొట్టడం పిచ్చాపాటి మాట్లాడుకోవడం వీరి దినచర్య. వీరిలో సరోజ అనే మహిళ జూన్‌ 12న మరణించింది. సహజమరణంగా భావించి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తాజాగా సరోజది సహజ మరణం కాదు, హత్య అని తెలియడంతో మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్‌ చేశారు. అసలేం జరిగిందంటే.. చిత్తూరు శివారు ప్రాంతం యాదవ కాలనీలో ఉండే సరోజ, నదియా ల కులాలు వేరైనా వీరిద్దరూ మంచి స్నేహితులు. సరోజకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉండగా నదియాకు ఒక కుమార్తె ఉంది. సరోజ చిన్న కొడుకు కన్నన్‌కు నదియా తన కూతురునిచ్చి పెళ్లి చేయాలని భావించింది. రోజూలాగే మందు కొడుతూ ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో నదియా పెళ్లి ప్రస్తావన తెచ్చింది. తన కుమార్తెను సరోజ చిన్న కొడుకు కన్నన్‌కి పెళ్లిచేయాలనుకుంటున్నట్టు చెప్పింది. తమ కులాలు వేరు కావడంతో పెళ్లికి అంగీకరించలేదు సరోజ. దాంతో ఆగ్రహించిన నదియా సరోజను దారుణంగా హత్యచేసి వెళ్లిపోయింది. ఇదంతా అక్కడ పక్కనే ఉండే ఓ కుర్రాడు గమనిస్తున్నాడని నదియాకు తెలియదు. ఏమీ ఎరుగనట్టు సరోజ అంత్యక్రియల్లో పాల్గొంది నదియా. అంతా అయిపోయింది తనకేం కాదు అనుకున్న నదియాకు షాకిస్తూ పోలీసులొచ్చి ఆమెను అరెస్ట్‌ చేశారు. సరోజను హత్య చేస్తుండగా చూసిన కుర్రాడు ఆమె కుమారుడు కన్నన్‌కి విషయం మొత్తం చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న సరోజను ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ కప్పేసి, దిండుతో నొక్కి చంపేసిందని కుర్రాడు వివరించాడు. వెంటనే సరోజ కొడుకు కన్నన్ చిత్తూరు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తిరుపతిలో నిందితురాలు నదియాను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. సరోజ కొడుకుకు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని నదియా ప్రపోజల్ పెట్టగా, సరోజ నదియా కులం ఏంటని నిలదీసిందని, దాంతో తనపై కోపం వచ్చి మద్యం మత్తులో ఉన్న సరోజను హత్య చేసినట్టు నదియా నేరం అంగీకరించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్.. అదిరిపోయే ఆఫర్ గురూ

క్లాస్‌ రూమ్‌లో శ్రద్ధగా చదువుకుంటున్న విద్యార్థులు.. ఉన్నట్టుండి హాజరైన అనుకోని అతిధి.. కట్ చేస్తే

మరోసారి జంటగా కనిపించిన విజయ్‌దేవరకొండ-రష్మిక.. ఈసారి

ఘోరమైన యాక్సిడెంట్!! చావు నుంచి బయటపడ్డ గీతూ రాయల్

ఇక్కడ వాడుకునే వాళ్లు ఎక్కువయ్యారు