ఈ గొడుగు వేసుకుంటే కరోనా పరారే.. చైనా దంపతుల సూపర్ ఐడియా..
కరోనా మహమ్మారినుంచి రక్షించుకునేందుకు ప్రజలు రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మాస్క్ మస్ట్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి.
కరోనా మహమ్మారినుంచి రక్షించుకునేందుకు ప్రజలు రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మాస్క్ మస్ట్ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అయితే ఈ మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు మరో అడుగు ముందుకేసి, వినూత్నంగా ఆలోచించారు ఈ దంపతులు. చైనాలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.. వైరస్ నుంచి కాపాడుకునేందుకు చైనా దంపతులు వినూత్న ఐడియాతో ముందుకొచ్చారు. ఈ జంట ఓ భారీ గొడుగును కవచంగా ధరించి షాపింగ్‌కు వచ్చారు. ప్లాస్టిక్ షీట్‌తో కూడిన ఈ భారీ గొడుగు దంపతుల పాదాల వరకై కవర్ చేసింది. మార్కెట్‌లో సరుకులను కొనేందుకు విలక్షణ గొడుగుతో బయటకు వచ్చిన వీడియోను షేర్ చేస్తూ.. సెల్ఫ్ ప్రొటెక్షన్‌ను మరో స్ధాయికి తీసుకువెళ్లిన చైనా దంపతులు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. పీపుల్స్ డైలీ చైనా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను 83,000 మందికి పైగా వీక్షించారు. ఇది చూసి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ గొడుగు వీరిని వర్షం నుంచి కూడా కాపాడుతుందని పలువురు కామెంట్ చేశారు. అయితే ఈ విలక్షణ గొడుగు లోకల్ ట్రైన్లు, బస్సుల వంటి రద్దీ ప్రాంతాల్లో వాడేందుకు వీలు కాదని మరికొందరు రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తుపాకీలో తూటా ఎలా లోడ్ చేయాలో మర్చిపోయిన ఉత్తరప్రదేశ్ ఎస్సై..
వీధుల్లో స్వేచ్ఛగా సంచరిస్తున్న వింత జీవులు.. భయం భయంగా జనాలు..
మసీదులో దొంగలు పడ్డారు.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే ఆశ్చర్య పోతారు !!
ఒంటిపై బట్టలు లేకున్నా.. అలానే వచ్చి దొంగలను పరిగెత్తించాడు
క్రమం తప్పకుండా గుడికి వెళ్తున్న కోతి.. శివునికి మొక్కుతూ..