Viral: వీడిన మిస్టరీ.. ప్రపంచాన్నే వణికించిన భారీ గొయ్యి ఎలా ఏర్పడిందంటే ??
భారీగా, ఎంతలా అంటే ఊళ్లకు ఊళ్లనే మింగేసేంతగా ఆ గొయ్యి.. అంతకంతకు పెరుగుతూ చిలీ దేశాన్ని.. అక్కడి నుంచి ప్రపంచాన్నే వణికించింది. ఏదో వినాశనం తప్పదంటూ ప్రచారమూ ఊపందుకుంది.
భారీగా, ఎంతలా అంటే ఊళ్లకు ఊళ్లనే మింగేసేంతగా ఆ గొయ్యి.. అంతకంతకు పెరుగుతూ చిలీ దేశాన్ని.. అక్కడి నుంచి ప్రపంచాన్నే వణికించింది. ఏదో వినాశనం తప్పదంటూ ప్రచారమూ ఊపందుకుంది. దీని వెనుక అతిశయోక్తి మాత్రమే ఉందని చెబుతూ.. అసలు విషయాన్ని వెల్లడించారు అధికారులు. చిలీ రాజధాని శాంటియాగోకు 800 కిలోమీటర్ల దూరంలో భారీ గుంత ఏర్పడి.. క్రమక్రమంగా పెరుగుకుంటూ పోతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. వెడల్పు అంతకు అంతకు పెరుగుతూ.. సుమారు 200 మీటర్ల లోతైన ఈ గుంత.. మన శాట్చ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని మింగేసేంత సామర్థ్యం సంతరించుకుంది.ఇప్పుడు ఆ మిస్టరీని దాదాపుగా చేధించారు. Tierra Amarilla.. ప్రపంచంలోనే ఎక్కువగా కాపర్‌ను ఉత్పత్తి చేసే హబ్. కెనడాకు చెందిన ఓ కంపెనీ కార్యకలాపాల వల్లే ఈ భారీ గొయ్యి ఏర్పడి ఉంటుందని ఒక అంచనాకి వచ్చారు. దానిని పూడ్చే ప్రయత్నాల గురించి ఆలోచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పూటగడవడం కష్టంగా ఉంది.. ఏదైన ఉద్యోగం ఇప్పించండి ప్లీజ్.. అంటున్న భారత క్రికెటర్
కొత్త జంటకు బంధువుల వింత ప్రశ్న..! సిగ్గుతో ఊగిపోయిన నవవధువు
ప్రమాదంలో ఉన్న మహిళ !! అది చూసిన శునకం ఏం చేసిందో తెలుసా ??
Viral Video: వేడివేడిగా పూరి ఆర్డర్.. సర్వ్ చేసింది చూసి షాక్ !!
Chiranjeevi Birthday: బర్త్‌డే విషెస్ అంటే ఇది.. వింటే విజిల్స్ పడాల్సిందే