కొన్న కోడికన్నా..కొట్టుకొచ్చిన కోడి రుచి ఎక్కువంట.. అందుకే వీడియో

Updated on: Jul 21, 2025 | 9:22 PM

కొన్న కోడికన్నా.. కొట్టుకొచ్చిన కోడి రుచి ఎక్కువ అని నానుడి. అందుకే కొంతమంది పక్కింటివాళ్ల కోళ్లను దొంగచాటున పట్టేసుకుని ఆరగించేస్తుంటారు. అందులోనూ నాటుకోళ్ల విషయంలో ఈ దొంగతనాలు బాగా జరుగుతాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగకోళ్లు పట్టేవాళ్లు రెచ్చిపోయారు. కోళ్ల ఫారాల్లో చొరబడి కోళ్లను ఎత్తుకెళ్లి విక్రయించుకుంటూ కోళ్ల రైతులకు నష్టం కలిగిస్తుండంతో కోళ్లను పెంచుకునేవారు లబోదిబోమంటున్నారు.

 నాటు కోడి రుచికి మరే కోడీ సాటిరాదు. అందుకే ఈ కోళ్లకు డిమాండూ ఎక్కువే.. ధరకూడా ఎక్కువే. ఈజీమనీకి అలవాటుపడిన కొందరు ఈ కోళ్ల దొంగతనాలను ఎంచుకున్నారు. కోళ్ల ఫారాల్లో చోరీలకు పాల్పడుతూ కొట్టుకెళ్లిన కోళ్లను మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నాటుకోళ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. వీటికి గిరాకీ పెరుగుతుండటంతో.. దొంగల కన్ను వీటిపై పడుతోంది. ఇలా చూసిన కోడిని అలా మాయం చేసేస్తున్నారు. నాటు కోళ్లు పెంచే వారికి దొంగల బెడద ఎక్కువైపోయింది. అయితే కోళ్ల దొంగతనం కోసం వచ్చిన ఓ యువకుడికి ఈసారి చుక్కెదురైంది. ప్లాన్‌ వర్కవుట్‌ కాకపోవడంతో అక్కడి నుంచి పారిపోయాడు.

మరిన్ని వీడియోల కోసం :

అందమైన అమ్మాయి ఫోటో దిగుతుంటే.. ఏనుగు పిల్ల ఏం చేసిందో చూడండి!

దారితప్పి తల్లికోసం తల్లడిల్లిన గున్న ఏనుగు.. తల్లిని కలిసిన తర్వాత వీడియో

ప్రొటీన్ పౌడర్‌ని ఇంట్లో తయారు చేయండి ఇలా వీడియో

ఇక రైళ్లలో చీమ చిటుక్కుమన్నా అవి కనిపెట్టేస్తాయ్‌ వీడియో