Dog-chick: కుక్క దగ్గరకు వెళ్లి ఈ కోడిపిల్ల ఏం చేసిందో మీరే చూడండి.. కుక్కపిల్ల రియాక్షన్ చూస్తే నవ్వాగదు..

ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. మారుమూల గ్రామాలు సైతం సోషల్‌మీడియా పుణ్యమా అని వెలుగులోకి వస్తున్నాయి. ఇక వన్యప్రాణులు, పెంపుడు జంతువులు..

Dog-chick: కుక్క దగ్గరకు వెళ్లి ఈ కోడిపిల్ల ఏం చేసిందో మీరే చూడండి.. కుక్కపిల్ల రియాక్షన్ చూస్తే నవ్వాగదు..

|

Updated on: Aug 11, 2022 | 8:19 AM


ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. మారుమూల గ్రామాలు సైతం సోషల్‌మీడియా పుణ్యమా అని వెలుగులోకి వస్తున్నాయి. ఇక వన్యప్రాణులు, పెంపుడు జంతువులు ఇలా రకరకాల అంశాలకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌చేస్తూ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక పెంపుడు జంతువుల చేష్టలు చాలా ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఒక పెంపుడు కుక్క, కోడిపిల్లలకు సంబంధించిన ఫన్నీ వీడియో నెటిజన్లను తెగ నవ్విస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఇంట్లో రెండు పెంపుడు కుక్కలు పడుకొని ఉన్నాయి. వాటి దగ్గరకు బంగారు వర్ణంలో అందగా క్యూట్‌గా ఉన్న మూడు కోడి పిల్లలు చేరాయి. అవి ఎంతో స్నేహంగా ఉన్నాయి. ఇంతలో ఉన్నట్టుండి ఓ కోడిపిల్ల ఆ కుక్క నాలుకను తన ముక్కుతో కొరికేసింది. దాంతో కళ్లు పెద్దవి చేసి ఆశ్చర్యంగా కోడిపిల్లను చూస్తుండిపోయింది ఆ కుక్క. ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రాంలో వైరల్‌ అవుతున్నాయి. “లోలోకు కోడిపిల్లలంటే ఇష్టం” అంటూ క్యాప్షన్‌తో ఈ ఫోటోలను షేర్‌ చేశారు. ఈ ఫొటో చూసిన నెటిజన్లు కుక్క లోలో ఇచ్చిన రియాక్షన్స్‌కి తెగ నవ్వుకుంటున్నారు. లోలో వంటి స్నేహితుడు ఉంటే జీవితం అంతా సరదాగా గడిచిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. మిగతా ఫొటోల్లో కోడి పిల్లలను చూసి లోలో ప్రశాంతంగా నవ్వుతున్నట్లు కనిపిస్తూ నెటిజన్ల మనసు దోచుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us