Man lifting bike: వీడోరకం బాహుబలి.. బైక్ ను అమాంతం ఎత్తేశాడు.. ఇలా చెయ్యడం సాధ్యమా..?
సోషల్ మీడియాలో రోజూ రకరకాల వీడియోలు పోస్ట్ అవుతూ ఉంటాయి. వీటిని చూస్తూ టైం కూడా మర్చిపోయే వారు చాలామందే ఉన్నారు. అలాంటి వీడియోల్లో కొన్ని భయం కలిగిస్తే,
సోషల్ మీడియాలో రోజూ రకరకాల వీడియోలు పోస్ట్ అవుతూ ఉంటాయి. వీటిని చూస్తూ టైం కూడా మర్చిపోయే వారు చాలామందే ఉన్నారు. అలాంటి వీడియోల్లో కొన్ని భయం కలిగిస్తే, మరికొన్ని ఔరా అనిపిస్తాయి. ఈ ప్రపంచంలో ట్యాలెంట్ కు కొదవ లేదు. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఎందరో ట్యాలెంటెడ్ వ్యక్తులు వెలుగులోకి వస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి ఏదైనా చేయాలనుకుంటే ముందు నమ్మకం ఉండాలి. నమ్మకం ఎంతటి శక్తినైనా ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన తలపై సుమారు 150 కిలోల బరువైన బైక్‌ను ఎత్తుకుని ఎటువంటి సపోర్ట్ లేకుండా నిచ్చెనపైనుంచి ఎక్కి దానిని బస్సు పైకి ఎక్కించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిని ప్రంశంసిస్తున్నారు. ట్విట్టర్‌లో పోస్ట్ అయిన ఈ వీడియోకు ‘ప్రజలు తమ కార్మిక పోరాటం కోసం ఎంతైనా కష్టపడతారు’ అనే క్యాప్షన్ జోడించారు. ఈ క్లిప్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను వేలమంది వీక్షిస్తున్నారు. లైక్స్‌తో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ‘ఈ స్టంట్‌ని బాహుబలి ప్రభాస్‌కి, జాన్ ఆఫ్ ఫోర్స్‌కి చూపించాలని’ కొందరు, ‘వావ్! బ్యాలెన్స్ సూపర్ ‘ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్.. సూపర్ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

