Tirumala: తిరుమల నడకమార్గంలో మళ్లీ భయం భయం.. ఇలా ఎంతకాలం..?

|

May 24, 2024 | 8:08 AM

తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుతల భయం ఆందోళన కలిగిస్తోంది. చిరుత సంచారంతో మళ్ళీ భక్తుల్లో కలవరం మొదలైంది. సోమవారం అలిపిరి నడక దారి చివర్లో ఆళ్వార్ విగ్రహం వద్ద చిరుతలు సంచిరించడాన్ని భక్తులు గుర్తించారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆళ్వార్ విగ్రహం ప్రాంతంలో ఇనుప కంచె అవతల గుబురుగా ఉన్న చెట్ల మద్య ఉన్న రెండు చిరుతలను చూసి భయంతో భక్తులు కేకలు వేశారు.

తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుతల భయం ఆందోళన కలిగిస్తోంది. చిరుత సంచారంతో మళ్ళీ భక్తుల్లో కలవరం మొదలైంది. సోమవారం అలిపిరి నడక దారి చివర్లో ఆళ్వార్ విగ్రహం వద్ద చిరుతలు సంచిరించడాన్ని భక్తులు గుర్తించారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఆళ్వార్ విగ్రహం ప్రాంతంలో ఇనుప కంచె అవతల గుబురుగా ఉన్న చెట్ల మద్య ఉన్న రెండు చిరుతలను చూసి భయంతో భక్తులు కేకలు వేశారు. వీరి కేకలు విని చిరుతలు అడవిలోకి వెళ్లిపోయాయి. ఘటన స్థలానికి చేరుకుని చిరుతల జాడ తెలుసుకునే ప్రయత్నం చేపట్టింది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది. చిరుత సంచారంపై ఫారెస్ట్ సిబ్బంది కూడా అప్రమత్తం అయ్యింది. గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతంలో చిరుత సంచారాన్ని గుర్తించలేదని అటవీ సిబ్బంది తెలిపారు.

చిరుత సంచారంతో సెక్యూరిటీ సిబ్బంది భక్తుల భద్రత దృష్ట్యా పలు ఆంక్షలు అమలు చేస్తోంది. అలిపిరి నడక మార్గంలో గత ఏడాది జూలై ఆగస్టు నెలల్లో కౌశిక్, లక్షితపై చిరుతల దాడి జరిగినప్పటి నుంచి దాదాపు 10 నెలలుగా నడక మార్గంలో టిటిడి అప్రమత్తంగా ఉంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 12 ఏళ్ల లోపు వయసున్న పిల్లలను నడక మారాల్లో అనుమతించడంలేదు. మరోవైపు నడక మార్గంలో భక్తులకు స్వీయ రక్షణ కోసం టీటీడీ ఊత కర్రలను ఇస్తోంది. గుంపులు గుంపులు గానే అనుమతిస్తున్న టీటీడీ 7 వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేసింది. నడక మార్గం ఇరువైపులా ముళ్ళపదలను తొలగించి, లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేసిన టిటిడి విజిలెన్స్, అటవీశాఖ నిరంతర గస్తీ నిర్వహిస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on