ఉబెర్‌లో హెలిక్యాప్టర్ సేవ‌లు.. అవాక్కయిన మ‌హిళ‌ !!

మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలనుకునేవారు ఉబెర్‌ క్యాబ్‌, ఆటో లేదా బైక్‌ను బుక్‌ చేసుకుంటారు కదా. అలా క్యాబ్‌ బుక్‌ చేసుకున్న ఓ మహిళకు ఉబెర్‌ బంపర్‌ ఆఫర్ ఇచ్చింది.

Phani CH

|

May 08, 2022 | 9:36 AM

మీరు ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలనుకునేవారు ఉబెర్‌ క్యాబ్‌, ఆటో లేదా బైక్‌ను బుక్‌ చేసుకుంటారు కదా. అలా క్యాబ్‌ బుక్‌ చేసుకున్న ఓ మహిళకు ఉబెర్‌ బంపర్‌ ఆఫర్ ఇచ్చింది. అతి త‌క్కువ‌ధ‌ర‌లో హెలిక్యాప్టర్ సేవ‌ల‌ను అందుబాటులో ఉంచింది. ఉబెర్‌లో హెలిక్యాప్టర్ సేవ‌లు చూసి ఆశ్చర్యపోయింది ఆ మ‌హిళ. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆ మహిళ సోష‌ల్‌మీడియాలో పెట్టగా, అది వైర‌ల్‌గా మారింది. యూఎస్‌లోని న్యూయార్క్‌కు చెందిన ఓ మహిళ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడానికి క్యాబ్‌ బుక్‌ చేసుకుందామని ఉబెర్‌ యాప్‌ ఓపెన్‌ చేసింది. అయితే, అందులో క్యాబ్‌తోపాటు హెలిక్యాప్టర్ సేవ‌లుకూడా క‌నిపించాయి. ఉబెర్ ఎక్స్‌కు 126 డాల‌ర్లు, ఉబెర్ క్యాబ్‌కు 102 డాల‌ర్లు చూపించ‌గా, హెలిక్యాప్టర్‌కు 101 డాల‌ర్లుగా ధరలు చూపించింది. ఎంతో ఖరీదైన హెలికాఫ్టర్‌ సేవలు కేవలం 101 డాలర్లే ఉండటంతో.. ఆ వివరాలను సదరు మహిళ స్క్రీన్‌షాట్‌ తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హ్యారీ పోటర్ థీమ్ సాంగ్‌ను పాడుతున్న పక్షి.. నెటిజన్లు ఫిదా.

మట్టిలో పండే బంగాళాదుంప గాలిలో పండుతుంది..ఎక్కడంటే..

Viral Video: ట్యూన్‌ తగ్గట్టుగా స్టెప్పులు !! అల్లు అర్జున్‌కి పోటీగా ..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu