Whale Flight: భాగ్యనగరానికి అరుదైన అతిథి.. గాల్లో ఎగురుకుంటూ వచ్చిన తిమింగలం..! వైరల్ వీడియో.

Updated on: Dec 13, 2022 | 9:30 AM

తిమింగలం ఏంటి.. గాల్లో ఎగురుకుంటూ రావడమేంటి అనుకుంటున్నారా.. అవును ఈ అరుదైన అతిథి దుబాయ్‌నుంచి ఎగురుకుంటూ భాగ్యనగరానికిచేరుకుంది.


తిమింగలం ఏంటి.. గాల్లో ఎగురుకుంటూ రావడమేంటి అనుకుంటున్నారా.. అవును ఈ అరుదైన అతిథి దుబాయ్‌నుంచి ఎగురుకుంటూ భాగ్యనగరానికిచేరుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా గుర్తింపు పొందిన ‘ఎయిర్ బస్ బెలూగా’ లోహ విహంగం హైదరాబాదులో ల్యాండైంది. ఈ విశిష్ట అతిథికి హైదరాబాద్ ఎయిర్ పోర్టు వర్గాలు స్వాగతం పలికాయి. దుబాయిలోని అల్‌ మక్‌తుమ్‌ విమానాశ్రయం నుంచి థాయిలాండ్‌లోని పట్టాయా ఎయిర్‌పోర్టుకు వెళ్తూ మార్గంమధ్యలో ఇంధనం నింపుకోడానికి శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగింది.ఎయిర్‌బస్‌ కంపెనీ సరకు రవాణా కోసం తిమింగలం ఆకారంలో ఉండే విమానాలను తయారుచేసింది. కేవలం ఐదు విమానాలను మాత్రమే తయాచు చేశారు. విమానం పొడవు 56 మీటర్లు, బరువు 95 టన్నులు. ఇది 56 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎయిర్ బస్ సంస్థ దీన్ని ఒక తిమింగలం రూపంలో డిజైన్ చేసింది. ఇందులో అన్నీ ప్రత్యేకతలే. మామూలుగా అయితే అన్ని విమానాల్లోనూ లోడింగ్‌, అన్‌లోడింగ్‌ విమానం వెనుక వైపు నుంచి చేస్తారు. కానీ ఈ విమానంలో మాత్రం మాత్రం ముందు వైపునుంచే లోడింగ్‌ చేసే వీలుంది. లోడింగ్‌ సమయంలో ముందు భాగం పూర్తిగా పైకి లేస్తుంది. గతంలో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానంగా అంటోనొవ్‌ ఏఎన్‌-225 మ్రియాకు పేరుంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో భాగంగా ఆ విమానాన్ని ఇటీవలే రష్యా ధ్వంసం చేసింది. దీంతో ఇప్పుడు ఇదే అతిపెద్ద కార్గో విమానంగా పేరుగాంచింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Snake Bathing: నువ్వు తోపువి బాసూ.. కింగ్‌ కోబ్రాకి స్నానమా..! మగ్‌పై పలుమార్లు కాటు వేసిన పాము.. వీడియో.

Romance Before Marriage: పెళ్లికిముందే శృంగారం చేస్తే ఇక అంతే..! కొత్త చట్టం తీసుకురానున్న ప్రభుత్వం.

Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్‌ ప్రకటన..

Published on: Dec 13, 2022 09:30 AM