ఆట అనుకున్నాడు.. అమ్మనే కోల్పోయాడు

|

Dec 16, 2024 | 8:50 PM

చిన్న పిల్లలకు అందులోనూ మగ పిల్లలకు గన్ బొమ్మలు అంటే చాలా ఇష్టం. వాటిని చేతుల్లోకి తీసుకుని కాల్చేస్తున్నట్లు నటిస్తే.. వాళ్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చనిపోయినట్లు నటిస్తుండడం మనం చాలాసార్లే చూసి ఉంటాం. అయితే అమెరికాకు చెందిన ఓ బాలుడు కూడా కనిపించిన గన్ తీసుకుని తల్లికి గురి పెట్టాడు. కాల్చాడు కూడా.

అయితే ఆ తల్లి కూడా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది.అయితే బాలుడు ఎప్పటిలాగే తల్లి నటిస్తుందనుకుని దగ్గరకు వెళ్లాడు. అమ్మా, అమ్మా అని పిలిచాడు. కానీ ఆమె ఎంతకూ లేవలేదు. దీంతో గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు తల్లి దగ్గరకు వచ్చారు. రక్తపుమడుగులో పడి ఉండడం చూసి వెంటనే అంబులెన్సుకు ఫోన్ చేశారు. అయితే చికిత్స పొందతూ ఆ తల్లి మృతి చెందగా.. రెండేళ్ల బాలుడు సహా 8 నెలల బాబు తల్లి ప్రేమకు దూరం అయ్యారు. అయితే పిల్లలు ఉన్న చోట గన్ లోడ్ చేసి పెట్టింది ఎవరు, ఈ కేసులో నిందితులుగా పోలీసులు ఎవరిని అరెస్ట్ చేశారో చూద్దాం. అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న 22 ఏళ్ల జెసిన్యా మినాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్తతో విడాకులు తీసుకున్న ఆమె ప్రస్తుతం 18 ఏళ్ల ప్రియుడు ఆండ్రూ సాంచెస్‌తో కలిసి జీవనం సాగిస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడియో కోసం ప్రయత్నం.. రైల్లో నుంచి పడిపోయిన యువతి.. ఆ తరువాత ??

భూమిని ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్ !! ఇస్రో శాస్త్రవేత్తల హెచ్చరిక

వెంటపడి వెకిలి చేష్టలతో వేధించిన యువకులు.. తాట తీసిన శివంగి

బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూశాక షాక్ !!