Nagpur Bus Driver: బస్సుపై కాల్పులు.. చేతికి బుల్లెట్‌ గాయంతో 30 కి.మీ. నడిపిన డ్రైవరు.

Nagpur Bus Driver: బస్సుపై కాల్పులు.. చేతికి బుల్లెట్‌ గాయంతో 30 కి.మీ. నడిపిన డ్రైవరు.

Anil kumar poka

|

Updated on: Mar 14, 2024 | 7:37 PM

ఓ బస్‌ డ్రైవర్‌ చూపిన సాహసం 35 మంది ప్రయాణికులను కాపాడింది. దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడినా.. రక్తమోడుతూ అలాగే 30 కిలోమీటర్లు బస్‌ నడిపి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. మహారాష్ట్రలో ఘటన జరిగింది. అమరావతి నుంచి నాగ్‌పూర్‌ వెళ్తుండగా సోమవారం అర్థరాత్రి హైవే పైన ఓ మినీ బస్సుపై సోమవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు చోరీకి ప్రయత్నించారు.

ఓ బస్‌ డ్రైవర్‌ చూపిన సాహసం 35 మంది ప్రయాణికులను కాపాడింది. దోపిడీ దొంగలు జరిపిన కాల్పుల్లో గాయపడినా.. రక్తమోడుతూ అలాగే 30 కిలోమీటర్లు బస్‌ నడిపి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. మహారాష్ట్రలో ఘటన జరిగింది. అమరావతి నుంచి నాగ్‌పూర్‌ వెళ్తుండగా సోమవారం అర్థరాత్రి హైవే పైన ఓ మినీ బస్సుపై సోమవారం అర్థరాత్రి దోపిడీ దొంగలు చోరీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్‌పై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్‌ బుల్లెట్లు తగిలినా బస్సును ఆపకుండా 30 కిలోమీటర్లు నడుపుతూ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా అమరావతి నుంచి నాగ్‌పుర్‌లో ఆలయం దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా నంద్‌గావ్ పేత్ సమీపంలోని హైవే 6పై ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ ఖోమ్‌దేవ్ కవాడే తెలిపిన వివరాల ప్రకారం.. అమరాతిలోని ఆలయాన్ని దర్శించుకొని ప్రయాణికులతో నాగ్‌పుర్‌కు తిరుగు ప్రయాణమైనప్పటి నుంచి బొలెరో కారు బస్సును వెంబడించింది. బొలెరో వెళ్లడానికి రెండుసార్లు దారి ఇచ్చినా ముందుకువెళ్లకుండా వెనకే వచ్చారు. వాహనం నంబర్‌ సరిగ్గా గుర్తు లేదనీ కవాడె తెలిపాడు. ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న బొలెరో ఎస్‌యూవీ అని చెప్పాడు. కొంతసేపటికి బస్సు ముందుకు రాగా దుండగులు కారులో నుంచే తనపై కాల్పులు జరిపి, బస్సును ఆపేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. మొదటిసారి తప్పించుకున్నా, రెండోసారి మాత్రం తన చేతిపై బుల్లెట్‌ తలిగిందని చెప్పాడు. చేతికి గాయం అయినా బస్సును ఆపలేదు. నొప్పిని భరిస్తూనే అందులోని ప్రయాణికులను దుండగుల బారి నుంచి కాపాడాలని దాదాపు 30 కిలోమీటర్లు బస్సును నడిపి పోలీస్‌స్టేషన్‌ వద్దకు తీసుకెళ్లానని డ్రైవర్‌ తెలిపాడు. డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు ప్రయాణికులు కూడా గాయపడ్డారు. వారిని తివ్సాలోని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ చూపిన తెగువకు ప్రయాణికులు అతడిని ప్రశంసించారు. అతని వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని అన్నారు. డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..