క్రికెట్‌ గ్రౌండ్‌లోకి ఎద్దు ఎంట్రీ.. బ్యాట్‌లు వదిలి ప్లేయర్స్‌ పరుగో పరుగు

|

Feb 22, 2024 | 9:27 PM

సాధారణంగా క్రికెట్‌ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించడం మనం చూశాం. ఇటీవల గ్రౌండ్‌లోకి పాములు, ఉడుములు కూడా ఎంట్రీ ఇచ్చి ప్లేయర్స్‌ను భయపెట్టాయి. తాజాగా ఓ ఎద్దు గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప్లేయర్స్‌ను పరుగులు పెట్టింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది. ఓ మారుమూల ప్రాంతంలో కొందరు కుర్రాళ్లు గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడుకుంటున్నారు. ఆ గ్రౌండ్‌ రోడ్డుపక్కగా ఉంది.

సాధారణంగా క్రికెట్‌ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించడం మనం చూశాం. ఇటీవల గ్రౌండ్‌లోకి పాములు, ఉడుములు కూడా ఎంట్రీ ఇచ్చి ప్లేయర్స్‌ను భయపెట్టాయి. తాజాగా ఓ ఎద్దు గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప్లేయర్స్‌ను పరుగులు పెట్టింది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తోంది. ఓ మారుమూల ప్రాంతంలో కొందరు కుర్రాళ్లు గ్రౌండ్‌లో క్రికెట్‌ ఆడుకుంటున్నారు. ఆ గ్రౌండ్‌ రోడ్డుపక్కగా ఉంది. దూరంగా కూర్చొని కొందరు ఆటను చూస్తున్నారు. ఇంతలో రోడ్డుపైనుంచి రెండు ఎద్దులు వెళ్తున్నాయి. అందులో ఒక ఎద్దు సడన్‌గా క్రికెట్‌ గ్రౌండ్‌లోకి దూసుకొచ్చింది. దానిని తరిమేందుకు ప్లేయర్స్‌ ప్రయత్నించారు. అయితే ఆ ఎద్దు నన్నే తరిమికొడతారా అంటూ వారిపైకి దూసుకెళ్లింది. ఏ ఒక్కరినీ వదలకుండా అందరినీ తరిమికొట్టింది. ఊహించని పరిణామానికి ఆట‌గాళ్లంతా భయంతో త‌లోదిక్కుకు ప‌రుగెత్తారు. మ్యాచ్ చూసేందుకు వ‌చ్చిన వాళ్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గుర‌య్యారు. ఓ ట్విట్టర్‌ యూజర్‌ ఎక్స్‌ఖాతాలో పోస్ట్‌చేసిన ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోతుల కోసం మినీ సిటీ !! మండిపడుతున్న అమెరికన్స్

కుమారీ ఆంటీ స్టైల్ లో ట్రాఫిక్ పోలీసుల ఫైన్లు..

అమృత్‌ భారత్‌కు అనూహ్య స్పందన.. పట్టాలపైకి మరో 50 రైళ్లు

విశ్వం తొలినాళ్లలో ఏర్పడ్డ నక్షత్ర మండలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

స్వాతంత్య్రం వచ్చాక అక్కడ తొలిసారిగా జాతీయ జెండా రెపరెపలు