Water RS 1.30: బిందె నీళ్లు రూ.1.30 లక్షలు.. ఈ నీటితో స్నానం చేస్తే సంతానప్రాప్తి..! ఎక్కడో తెలుసా..?

Updated on: Apr 24, 2022 | 8:23 AM

హిందూ ఆలయాల్లో నీటి గుండాలు కనిపిస్తాయి. భక్తులు ఆ గుండాల్లో పుణ్యస్నానాలు ఆచరించి దేవుడిని దర్శించుకుంటారు. కొందరైతే గుండంలోని నీటిని బాటిళ్లలో నింపుకొని ఇళ్లకు తీసుకెళ్తారు.


హిందూ ఆలయాల్లో నీటి గుండాలు కనిపిస్తాయి. భక్తులు ఆ గుండాల్లో పుణ్యస్నానాలు ఆచరించి దేవుడిని దర్శించుకుంటారు. కొందరైతే గుండంలోని నీటిని బాటిళ్లలో నింపుకొని ఇళ్లకు తీసుకెళ్తారు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఉచితంగానే ఇస్తారు. కానీ ఆలయ గుండంలోని లక్షల రూపాయలకు విక్రయించడం ఎక్కడైనా చూశారా..! ఒడిశాలోని ముక్తేశ్వర పుణ్యక్షేత్రంలో ఒక బిందె నీరు 1.30 వేల రూపాయలు పలికింది. ఆ నీటిని తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ఎందుకంటే..ఒడిశా భువనేశ్వర్‌లోని ముక్తేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉన్న మరీచి గుండం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ గుండంలో నీటితో స్నానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. ఈ గుండం చుట్టుపక్కల ఉన్న అశోక చెట్ల వేర్ల ప్రభావంతో ఆ నీటిలో ఔషధ గుణాలుంటాయని స్థానికులు చెబుతారు. ఈ కారణంగా ప్రతి ఏటా మరీచి గుండంలోని నీటిని.. లింగరాజస్వామి రుకుణ (రథ) యాత్రలో భాగంగా ఏటా అశోక అష్టమి ముందు రోజు రాత్రి వేలంలో విక్రయిస్తారు. లింగరాజ ఆలయంలో ఉండే బడునియోగ్‌ వర్గానికి చెందిన సేవాయత్‌లు ఈ ప్రక్రియ చేపడతారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేలంపాటలో తొలి బిందె నీటి ధర 25 వేలతో ప్రారంభమైంది. ఆ బిందెను భువనేశ్వర్‌లోని బారాముండా ప్రాంతానికి చెందిన దంపతులు లక్షా 30 వేలకు కొనుక్కున్నారు. రెండో బిందెను 47 వేలు, మూడో బిందె నీటిని 13 వేల రూపాయలకు భక్తులు దక్కించుకున్నారు. మిగిలిన నీటిని పేద దంపతులకు ఉచితంగా పంపిణీ చేశారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Elephant-Lion: అః.. కుక్క మొరిగితే కొండకు సేట.. ఏనుగుపై సింహం దాడి.. కట్‌చేస్తే.. సీన్‌ రివర్స్‌

kacha badam Singer: తత్వం బోధపడింది.. నేనేంటో తెలిసొచ్చింది.. కచ్చా బాదామ్‌ సింగర్‌ మాటలు వింటే షాక్…

Viral Video: అవ్వ..! పెళ్లిలో వరుడి స్నేహితుడి నిర్వాకం.. ఏం చేస్తున్నాడో మీరే చూడండి..

Viral Video: వారేవా ఇది కదరా స్నేహమంటే.. దివ్యాంగుడిని భుజాలపై తిప్పిన గర్ల్స్‌.. వైరల్ వీడియో

Shashi Tharoor-Supriya Sule: నిండు సభలో సుప్రియతో అదేం పని శశిథరూర్‌.! వీడియో చుస్తే ఫ్యూజులు ఔట్ అంతే..

Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..

Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Published on: Apr 24, 2022 07:57 AM