Bride video: వెరైటీ కోసం ఈ వధువు ఏం చేసిందో చూడండి.. పట్టు వస్త్రాలు ధరించి, అందంగా ముస్తాబైన ఆ పెళ్లికూతురు..
పెళ్లి కూతురు తన వివాహ నిమిత్తం మండపానికి చేరుకోడానికి వినూత్న ప్రయత్నం చేసింది. చక్కగా పెళ్లికి సంబంధించిన సంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి, అందంగా ముస్తాబైన ఆ పెళ్లికూతురు
ప్రెజంట్ అంతా బుల్లెట్ బండి ట్రెండ్ నడుస్తోంది.. ప్రతి ఒక్కరూ బుల్లెట్ ఎక్కి డుగ్గు డుగ్గు మంటూ దూసుకెళ్తున్నారు. ఫొటోలు, వీడియోలు తీయించుకుని మురిసిపోతున్నారు. ఈ క్రమంలో ఓ నవ వధువు తన పెళ్లి మండపానికి వెళ్లడానికి ఈ బుల్లెట్ బండిని వాహనంగా చేసుకుంది. ఎందుకంటే తన వివాహం జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలనుకుంది. ఇటీవల అందరూ అలానే అనుకుంటూ.. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు అనుకోండి. ఈ వధువు మాత్రం కాస్త వినూత్నంగా ఆలోచించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో పెళ్లి కూతురు తన వివాహ నిమిత్తం మండపానికి చేరుకోడానికి వినూత్న ప్రయత్నం చేసింది. చక్కగా పెళ్లికి సంబంధించిన సంప్రదాయ పట్టు వస్త్రాలు ధరించి, అందంగా ముస్తాబైన ఆ పెళ్లికూతురు ప్రస్తుతం కుర్రకారును ఊపేస్తున్న బుల్లెట్టు బండిపై డుగ్గు డుగ్గు మని దూసుకెళ్లింది. వివాహ వేదికకు చేరుకోగానే వరుడి మెడలో వరమాల వేసింది. కాగా.. ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. వీడియో చూసిన వేలాదిమంది నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆధునిక వాహనంపై దూసుకెళ్తున్న రాజకుమారి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

