Snake acting: అబ్బా ఎం యాక్టింగ్ గురు..! ఈ పాము స్టార్ హీరోలను మించిపోయిందిగా.. ఆస్కార్ ఇవ్వాల్సిందే
నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పాము ఫుట్‌పాత్ పక్కగా పాకుతూ ఉంది. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతనిని చూసిన వెంటనే పాము కంగారుపడుతుంది. ఆ తర్వాత వేగంగా పాకుతూ వెళ్తుంది.
సాధారణంగా సినీ నటులు తెరపై అద్భుతంగా నటించడాన్ని మనం చూసి ఉంటాం. కానీ నిజ జీవితంలో ఏదైనా జంతువు నటించడం చూశారా ? అయితే ఇప్పుడు చూడండి.. కొన్ని మూగజీవాలు కూడా మనుషుల్లా ప్రాణాపాయ పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడానికి ఏదైనా చేస్తాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫన్నీ వీడియోలో, పాము చనిపోయినట్లు నటిస్తుంది. ఎంతలా అంటే సోషల్ మీడియా యూజర్లు కూడా దాని తెలివిని చూసి ఆశ్చర్యపోతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పాము ఫుట్‌పాత్ పక్కగా పాకుతూ ఉంది. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. అతనిని చూసిన వెంటనే పాము కంగారుపడుతుంది. ఆ తర్వాత వేగంగా పాకుతూ వెళ్తుంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి పామును తన చేతివేళ్లను గన్‌లా పేల్చి పామును కాల్చిచంపుతున్నట్లు నటించాడు. అయితే పాముకూడా తానేం తక్కువ కాదు అన్నట్టుగా తన తెలివిని ప్రదర్శించింది. అతని కంటే రెండడుగులు ముందుకు వెళ్లి చనిపోయినట్లు నటించింది. నాలుకను బయటకు పెట్టి మరీ విచిత్రంగా ప్రవర్తించింది. బహుశా ఇలా చనిపోయినట్లు నటిస్తే.. ఇక తన జోలికి రారని ఆ పాము భావించిందేమో. అందుకే ఇలా నటించిందేమో.ఈ వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించగా వేలల్లో లైక్ చేస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. వ్యూస్, వేలల్లో కామెంట్లు, లైక్‌లు వస్తున్నాయి. ‘ఈ సంవత్సరంలో బెస్ట్ యాక్టర్ అవార్డు దీనికే ఇవ్వొచ్చు’, ‘ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తోందిగా’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇది నకిలీ తుపాకీకే ఇంతలా భయపడుతోందంటే అది కచ్చితంగా చైనీస్ పాము అయి ఉండాలి’ అంటూ మరొకరు సరదాగా స్పందించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

