Boy Harassment: బాలుడి జననాంగానికి తాడు బిగించిన తోటి విద్యార్థులు.. ఆ తరువాత.. వామ్మో .. !

Boy Harassment: బాలుడి జననాంగానికి తాడు బిగించిన తోటి విద్యార్థులు.. ఆ తరువాత.. వామ్మో .. !

Anil kumar poka

|

Updated on: Jan 11, 2023 | 9:25 PM

దేశ రాజధాని ఢిల్లీలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. తాజాగా ఇందుకు నిదర్శనమైన దారుణ ఘటన ఒకటి ఢిల్లీలో వెలుగు చూసింది.


దేశ రాజధాని ఢిల్లీలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. తాజాగా ఇందుకు నిదర్శనమైన దారుణ ఘటన ఒకటి ఢిల్లీలో వెలుగు చూసింది. కిద్వాయ్ నగర్ ప్రాంతంలోని న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో కొందరు సీనియర్ విద్యార్థులు.. ఎనిమిదేళ్ల బాలుడిని చిత్రహింసలకు గురి చేశారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అటల్ అద్రాష్ స్కూల్‌లో చదువుతున్నాడు. అయితే, స్కూల్‌లోని కొందరు విద్యార్థులు ఆ బాలుడి జననాంగానికి తాడు బిగించారు. తాడు పట్టి లాగుతూ నరకం చూపించారు. ఈ ఘటన డిసెంబర్‌ 28న చోటు చేసుకుంది. ఆరోజు బాలుడు ఇంట్లో స్నానం చేస్తుండగా.. తల్లిదండ్రులు గుర్తించారు. దాంతో జరిగిన విషయాన్ని బాలుడు తన తల్లిదండ్రులకు తెలిపాడు. వెంటనే వారు స్కూల్‌లో కంప్లైంట్ ఇచ్చి.. అనంతరం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రి నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆస్పత్రికి వెళ్లి బాలుడి పరిస్థితిపై ఆరా తీశారు. అతని నుంచి వాంగ్మూలం తీసుకుని.. వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, పర్యవేక్షణలో ఉంచామని వైద్యులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Crocodile-drone: అబ్భాబ్భా ఎం వీడియో గురు.. తనను క్యాప్చర్‌ చేస్తున్న డ్రోన్‌ను మొసలి ఏం చేసిందో చూస్తే..

School childrens: స్కూల్‌ పిల్లల్లోకి ఆత్మలు.. తాంత్రికుడిని పిలిచి పూజలు నిర్వహణ.. ఎవరో తెలిస్తే షాకే.!

Car accident: డ్రైవర్‌ ర్యాష్‌ డ్రైవింగ్‌.. ప్రశ్నించినందుకు కారుతో ఢీకొట్టి.. నడిరోడ్డుపై దారుణంగా.. వీడియో.

Published on: Jan 11, 2023 09:25 PM