సరస్సు నుంచి బయటపడ్డ ఇనుప పెట్టె !! తెరిచి చూడగ దెబ్బకి మైండ్ బ్లాక్

|

Jun 06, 2024 | 3:10 PM

నీళ్లలో పడిపోయిన విలువైన వస్తువుల వేటకు వెళ్లిన ఓ జంటను అదృష్ట దేవత కరుణించింది. రాత్రికి రాత్రే లక్షాధికారులను చేసింది. మాగ్నెట్ ఫిషింగ్ చేసిన ఆ జంటకు ఓ ఇనుప పెట్టె దొరికింది. అందులో వంద డాలర్ల నోట్లు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించగా.. వాటి యజమానిని గుర్తించే వివరాలేవీ లేకపోవడంతో పోలీసులు ఆ పెట్టెను వారికే తిరిగిచ్చేశారు. అమెరికాలోని న్యూయార్క్ లో చోటుచేసుకుందీ వింత ఘటన.

నీళ్లలో పడిపోయిన విలువైన వస్తువుల వేటకు వెళ్లిన ఓ జంటను అదృష్ట దేవత కరుణించింది. రాత్రికి రాత్రే లక్షాధికారులను చేసింది. మాగ్నెట్ ఫిషింగ్ చేసిన ఆ జంటకు ఓ ఇనుప పెట్టె దొరికింది. అందులో వంద డాలర్ల నోట్లు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించగా.. వాటి యజమానిని గుర్తించే వివరాలేవీ లేకపోవడంతో పోలీసులు ఆ పెట్టెను వారికే తిరిగిచ్చేశారు. అమెరికాలోని న్యూయార్క్ లో చోటుచేసుకుందీ వింత ఘటన. న్యూయార్క్ కు చెందిన జేమ్స్ కేన్, బార్బీ అగొస్తిని అనే జంటకు మాగ్నెట్ ఫిషింగ్ చేయడం సరదా.. పొరపాటునో, ప్రమాదవశాత్తో నీటిలో పడిపోయిన విలువైన వస్తువులను వెలికి తీసేందుకు చేసే ప్రయత్నమే మాగ్నెట్ ఫిషింగ్. చేపల వేటలాగే ఇందులోనూ ఓ గేలానికి చివర బలమైన అయస్కాంతాన్ని కట్టి నీటి అడుగున గాలిస్తుంటారు. ఆ అయస్కాంతానికి అతుక్కున్న ఇనుప వస్తువులను వెలికి తీసుకుంటారు. ఈ ప్రయత్నంలో విలువైన వాచీలు, ఫోన్లు, ఇనుప పెట్టెలు నీటి అడుగు నుంచి బయటపడుతుంటాయి. కేన్, అగొస్తిని జంట కరోనా కాలం నుంచి ఇలా మాగ్నెట్ ఫిషింగ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చిన్నా చితక వస్తువులు దొరకగా.. తాజాగా న్యూయార్క్ లేక్ లో ఓ పెట్టె దొరికింది. దానిని తెరిచి చూడగా.. నీటిలో తడిచి పాడైపోయిన స్థితిలో ఉన్న వంద డాలర్ల నోట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వాటి విలువ లక్ష డాలర్లకు పైనే ఉండొచ్చని (మన రూపాయలలో సుమారు 83 లక్షల పైమాటే) అంచనా వేసిన కేన్.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సరస్సు వద్దకు వచ్చిన పోలీసులు ఆ పెట్టెను నిశితంగా పరిశీలించారు. దాని యజమానిని గుర్తించే చిహ్నాల కోసం గాలించారు. ఎలాంటి ఆనవాళ్లూ లేకపోవడంతో వాటి స్వంతదారుడిని గుర్తించే వీలులేదని చెబుతూ ఆ పెట్టెను కేన్, అగొస్తిని జంటకే తిరిగిచ్చేశారు. న్యూయార్క్ లో అమలవుతున్న చట్టాల ప్రకారం.. దొరికిన వస్తువు యజమానిని గుర్తించలేని పక్షంలో ఆ వస్తువు ఎవరికైతే దొరుకుతుందో వారికే సొంతమవుతుంది. ఈ రూల్ ప్రకారం.. సరస్సులో దొరికిన ఇనుపపెట్టె, దానిలోని కరెన్సీ మొత్తం కేన్, అగొస్తిని పరమయ్యాయి. నీటిలో నాని శిథిలావస్థకు చేరిన డాలర్ల నోట్లను బ్యాంకులో మార్చుకునే వీలుండడంతో కేన్ దంపతులు ఆనందంతో పొంగిపోయారు. తమను అదృష్టం వరించిందని, గతంలో ఎన్నో పెట్టెలు దొరికినా ఇంత పెద్ద మొత్తంలో డాలర్లు మాత్రం వాటిలో దొరకలేదని చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన శవం.. 10 రోజులుగా ఆ నీళ్లే తాగుతున్న జనం

ఆ నటితో స్టార్ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్‌ పెళ్లా ??

వడదెబ్బకు గురైన వానరానికి ఓఆర్ ఎస్.. మానవత్వాన్ని చాటుకున్నారంటూ నెటిజన్ల ప్రశంసలు

పాపం దొంగ !! చోరీకి వెళ్లి మందేసాడు.. మర్చిపోయాడు..  చివరికి ??

హార్దిక్ పాండ్యా-నటాషా కలిసిపోయారా ??