Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: తవ్వకాల్లో బయటపడిన బోషాణం.. ఓపెన్‌చేసి చూడగా పోలీసులు షాక్‌..!

Viral: తవ్వకాల్లో బయటపడిన బోషాణం.. ఓపెన్‌చేసి చూడగా పోలీసులు షాక్‌..!

Anil kumar poka

|

Updated on: Aug 15, 2023 | 2:22 PM

అప్పడప్పుడూ తవ్వకాల్లో పురాతన వస్తువులు బయటపడటం మనం చూస్తుంటాం. తాజాగా చెన్నైలోని వేలూరులో ఓ పురాతన బోషాణం బయటపడింది. వేలూరు జిల్లా గుడియాత్తంలోని సందన పేట్టైలో మసూదికి సంబంధించి నిర్మాణ పనులకు తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో ఓ పెద్ద బోషాణం బయటపడింది. వెంటనే స్థానికులు గుడియాత్తం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాదాపు వెయ్యి కిలోల బరువున్న..

అప్పడప్పుడూ తవ్వకాల్లో పురాతన వస్తువులు బయటపడటం మనం చూస్తుంటాం. తాజాగా చెన్నైలోని వేలూరులో ఓ పురాతన బోషాణం బయటపడింది. వేలూరు జిల్లా గుడియాత్తంలోని సందన పేట్టైలో మసూదికి సంబంధించి నిర్మాణ పనులకు తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో ఓ పెద్ద బోషాణం బయటపడింది. వెంటనే స్థానికులు గుడియాత్తం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాదాపు వెయ్యి కిలోల బరువున్న ఆ బోషాణం పెట్టెలో భారీగా నిధి ఉండవచ్చని ప్రచారం జోరందుకుంది. దాంతో స్థానికులు ఆ భోషాణాన్నిచూసేందుకు అక్కడకు పోటెత్తారు. ఘటనాస్థలానికి చేరుకున్న గుడియాత్తం పోలీసులు ఆ పెట్టెను స్ధానిక వ్యాపారి ఇంతియాజ్‌ కుటుంబానికి చెందినదిగా గుర్తించారు. ఆ పెట్టెలో ఏముందో చూద్దామని భారీ కట్టర్‌లతో దాన్ని తెరిచేందుకు ప్రయత్నించారు. అతికష్టం మీద కొంత భాగం మాత్రమే ఓపెన్‌ అయిన ఆ పెట్టె ఖాళీగా ఉండటంతో పోలీసులు, స్థానికులు ఖంగుతిన్నారు. అనంతరం మసూది ప్రాంతంలో బయటపడిన ఆ బోషాణాన్ని మసూదికే అప్పగింస్తామని ఇంతియాజ్‌ కుటుంబసభ్యులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...