Pet Dog: కుక్కకు సంస్మరణ సభ.. వందలమంది ఘన నివాళి.. వీడియో వైరల్.
మనుషులు చనిపోతే కర్మకాండలు చేయడం, ప్రముఖులైతే సంస్మరణ సభలు నిర్వహించడం మనకు తెలుసు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క మృతి చెందితే దశదిన కర్మచేసి, గ్రామస్తులందరికీ భోజనాలు పెట్టి ఘనంగా నివాళి అర్పించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పోడూరు మండలం పెనుమదం గ్రామానికి చెందిన రాంబాబు15 ఏళ్ళ క్రితం బంధువుల వద్ద నుంచి కుక్క
మనుషులు చనిపోతే కర్మకాండలు చేయడం, ప్రముఖులైతే సంస్మరణ సభలు నిర్వహించడం మనకు తెలుసు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క మృతి చెందితే దశదిన కర్మచేసి, గ్రామస్తులందరికీ భోజనాలు పెట్టి ఘనంగా నివాళి అర్పించారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పోడూరు మండలం పెనుమదం గ్రామానికి చెందిన రాంబాబు15 ఏళ్ళ క్రితం బంధువుల వద్ద నుంచి కుక్క పిల్లను తెచ్చుకుని సాయి అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. అది ఇటీవల మృతి చెందడంతో తమ కుటుంబంలో ఓ సభ్యుడిలా పెరిగిన ఆ కుక్కకు హిందూ సంప్రదాయం ప్రకారం కర్మకాండలు జరిపించాడు. 11వ రోజున పెంపుడు కుక్కకు సంస్మరణ సభ ఏర్పాటు చేసి గ్రామస్తులందరికీ బోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులంతా హాజరై కుక్కకు నివాళులర్పించారు. ఆ కుక్క బ్రతికి ఉన్నప్పుడు తమను ఎలా గుర్తించేది, ఎలా మసలు కునేదో గుర్తుచేసుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...