Bonfire- Train: కదులుతున్న రైలులో చలిమంటలు.! తీవ్ర భయాందోళనలో తోటి ప్రయాణికులు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో చలి వణికిస్తోంది. పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక రైలులో ప్రయాణికులు చలికి గజగజా వణుకుతున్నారు. ఏసీ కోచ్‌లో ప్రయాణించేవారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. బయటి చలితోపాటు ఏసీ కూడా తోడవడంతో చలికి తట్టుకోలేక చలిమంటలు వేసుకుంటున్నారు. అవును.. మీరు విన్నది నిజమే రైలులోనే చలి మంటలు వేసుకున్నారు. కొందరు ప్రయాణికులు రైలు ఏసీ కోచ్‌లో చలి మంటలు వేశారు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో చలి వణికిస్తోంది. పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక రైలులో ప్రయాణికులు చలికి గజగజా వణుకుతున్నారు. ఏసీ కోచ్‌లో ప్రయాణించేవారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. బయటి చలితోపాటు ఏసీ కూడా తోడవడంతో చలికి తట్టుకోలేక చలిమంటలు వేసుకుంటున్నారు. అవును.. మీరు విన్నది నిజమే రైలులోనే చలి మంటలు వేసుకున్నారు. కొందరు ప్రయాణికులు రైలు ఏసీ కోచ్‌లో చలి మంటలు వేశారు. అది చూసి మిగతా ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఈ సంఘటన జరిగింది.
మీరట్-ప్రయాగ్‌రాజ్ సంగం ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ కోచ్‌లో కొందరు వ్యక్తులు చలిమంటలు వేశారు. కదులుతున్న రైలులో చలి మంటలు వేయడం చూసి ఆ కంపార్ట్‌మెంట్‌లోని మిగతా ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వారిని మంటలు వేయొద్దంటూ వారించారు. వారు వినలేదు. దాంతో మొబైల్ ఫోన్‌లో చలిమంటలు వీడియో తీసి.. పక్కన కంపార్ట్‌మెంట్‌లో ఉన్న టీసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న టీసీ, రైల్వే పోలీసులు.. చలి మంటలు వేసిన ప్రయాణికులను నిలదీశారు. భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు కుశాల్ పాల్ ఆర్య మద్దతుదారులు, ఆ సంఘం యువ బ్రిగేడ్ అధ్యక్షుడు గౌరవ్ తికాయిత్ కూడా ఈ రైలులో ప్రయాణించినట్లు స్టేషన్ డైరెక్టర్ అశుతోష్ సింగ్ తెలిపారు. రైలులో చలి మంటలు వేసిన నిందితులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos