భార్యను బలవంతంగా పారా గ్లైడింగ్ కు తీసుకెళ్ళిన భర్త !! తిట్ల దండకం అందుకున్న భార్య.. వీడియో
ఇటీవల పారాగ్లైడింగ్ సాహస యాత్రకు చాలామంది సై అంటున్నారు. కొందరు విజయవంతంగా ఈ యాత్రను పూర్తి చేస్తుంటే మరికొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఇటీవల పారాగ్లైడింగ్ సాహస యాత్రకు చాలామంది సై అంటున్నారు. కొందరు విజయవంతంగా ఈ యాత్రను పూర్తి చేస్తుంటే మరికొందరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక భర్త తన భార్యను ఇష్టం లేకపోయినా పారా గ్లైడింగ్ యాత్రకు తీసుకెళ్ళాడు. అంతే.. పైకి వెళ్లగానే భయపడుతూ ఆ మహిళ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. యాత్ర ప్రారంభంకాగానే సదరు మహిళ భయంతో చేతులతో కళ్లు మూసేసుకుంది. బిగ్గరగా కేకలు వేసింది. గైడ్ ఆమెకు ధైర్యం చెప్పటానికి ప్రయత్నించినా ఆమె వినిపించుకోలేదు. చేతులు మొద్దు బారిపోతున్నాయంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు గైడ్ ఆమెను సముదాయించి నవ్వించేందుకు జోక్ చేసినా ఆ మహిళకి భయం ఆగలేదు. భర్తపై కోపం నషాళానికి చేరడంతో “దేవుడా ఎందుకు ఇతన్ని పెళ్లి చేసుకున్నానా?’ అంటూ తిట్టిపోసింది.
Also Watch:
అమ్మకానికి అరుదైన బ్లాక్ డైమండ్ !! దాని ప్రత్యేకతలు ఇవే !! వీడియో
మార్కెట్‌లో కొత్తటీ !! టేస్ట్ అదిరిందంటున్న జనం !! వీడియో
బరువు తగ్గాలనుకునేవారికి గుడ్ న్యూస్ !! ఈ ఆకుకూరలు తింటే చాలు !! వీడియో
Viral Video: నీటిలో కొట్టుకుపోతున్న జింక పిల్ల !! ఒక్క ఉదుటన వెళ్లి కాపాడిన కుక్క !! వీడియో