Viral Video: వామ్మో..! దీని తెలివి తెల్లారా.. రెక్కల సాయంతో చేపల వేట.. వీడియో చూస్తే బిత్తరపోతారు..

నేను వేట మొదలు పెడితే వార్ వన్ సైడే మిత్రమా అంటూ ఛాలెంజ్ విసురుతోంది. వేటాడటంలో కూడా తనరూటే సెపరేట అని అంటోంది. ఎక్కడ ఎలా ఎర వేయాలో తెలిసుండాలని అంటోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: వామ్మో..! దీని తెలివి తెల్లారా.. రెక్కల సాయంతో చేపల వేట.. వీడియో చూస్తే బిత్తరపోతారు..
Black Heron Hunt Fish Min

Updated on: Feb 01, 2022 | 9:23 PM

వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్‌లు కూడా ఈ జంతువుల కదలికలను తమ కెమెరాల్లో బంధించి నెటిజన్లతో షేర్ చేసుకోవడం బహుశా ఇదే కారణం కావచ్చు. మనం అడవిలో జంతువుల జీవితాన్ని చూస్తే.. చాలా జంతువులు సజీవంగా ఉండటానికి ఇతర జంతువులను వేటాడతాయి. అవి ఏదో ఒకదానిని వేటాడి కడుపుని జీవిస్తుంటాయి. ఈ ఎపిసోడ్‌లో ఓ పక్షి వేటాడటం హైలెట్‌గా నిలుస్తుంది.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక పక్షి తన ఆహారం కోసం ఉపయోగించే లాజిక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన రెక్కలనే ఉపయోగించి చేపలను వేటాడుతోంది. అయితే ఈ కొంగ వేసిన ఎత్తుకు చేపలు చిక్కడం.. ఆ చేపలను పుష్టిగా ఆరగిచండం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ పక్షి అనుసరించిన ఈ పద్ధతిని మీరు చూస్తే.. మీరు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే ఇది తక్కువ శ్రమతో తన పని కానిస్తోంది.

ఈ వీడియో చూడండి

ఈ పక్షి వేటాడే శైలిని నెటిజనం చాలా ఇష్టపడతున్నారు. పక్షులను వేటాడే కళను పొగుడుతూ తమను తాము ఆపుకోలేక పోతున్నారు. సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు.  ‘ఈ వీడియో చూసిన తర్వాత నేను షాక్ అయ్యాను’ అంటూ ఓ యూజర్ ఇలా కామెంట్ చేశాడు. ఈ వీడియో are.you.curious పేరుతో Instagram ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వార్త రాసే వరకు 2 లక్షల మందికి పైగా లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి: Budget 2022 Speech Highlights: త్వరలో డిజిటల్ ​కరెన్సీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు నిర్మలమ్మ బూస్టర్..

Budget 2022: బంపర్‌ ఆఫర్స్‌.. నిర్మలమ్మ బడ్జెట్‌లో తగ్గినవి ఇవే.. చౌకగా మొబైల్ ఫోన్స్