పక్షి రాజ్‌ “పన్నాలాల్‌”ఎంత గొప్ప మనసు.. వీడియో

Updated on: Aug 15, 2025 | 11:29 AM

సాధారణంగా ఆ ప్రాంతం నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ బర్డ్‌మాన్ ఎంట్రీ తో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. బర్డ్‌మాన్‌ పలకరించగానే పక్షులన్నీ కూతపెడతాయి. అవి అతనితో మాట్లాడుతున్నాయేమో అన్నంతగా సందడి చేస్తాయి. ఝార్ఖండ్‌లోని ఓ అడవిలో పన్నాలాల్‌ పలకరింపును గుర్తుపట్టి అతను రాగానే పక్షులు అతన్ని చుట్టేస్తాయి. పక్షుల శబ్దాలను గుర్తించి వాటికి అర్థమయ్యేలా అతను కూడా నోటితో ధ్వనులు చేస్తారు.

స్థానికులు ప్రేమగా ‘బర్డ్‌ మ్యాన్‌’ అని పిలుచుకునే పన్నాలాల్‌ ఓ సాధారణ రైతు. రామ్‌గఢ్‌ జిల్లా సరయ్య కుండ్రు గ్రామానికి చెందిన పన్నాలాల్‌ పక్షులపై ప్రేమతో 25 ఏళ్లుగా తన సొంత డబ్బుతో 45కు పైగా పక్షి జాతులకు ఆహారం అందిస్తూ వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు. చాలాసార్లు గాయపడిన, అనారోగ్యంతో ఉన్న పక్షులను చేరదీసి వైద్యం అందించి, సపర్యలు చేసారు. ఝార్ఖండ్‌లోని విద్యాలయాలకు వెళ్లి విద్యార్థులకు పక్షుల కథలు చెబుతారు. కెమెరాలు, ఫోన్లు, సోషల్‌ మీడియా లేకుండా ప్రకృతితో మమేకం కావడం ఎలాగో నేర్పుతారు. పన్నాలాల్‌ ఎప్పుడూ ఆకుపచ్చ దుస్తులు ధరిస్తూ పక్షులు తనను కూడా అడవిజీవిగా గుర్తించాలని కోరుకుంటారు. పక్షులను తన స్నేహితులుగా భావిస్తాననీ ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించడమే తన ఏకైక లక్ష్యమనీ పన్నాలాల్‌ అంటారు. వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బుతో తన కుటుంబాన్ని, పక్షుల ఆహారం కోసం ఉపయోగిస్తాననీ ఎందుకంటే పక్షులు కూడా తన కుటుంబంలో భాగమే అని పన్నాలాల్ అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ప్రేమంటే ఇదే..చనిపోయిన తోడును లేపుతున్న పక్షి..కన్నీరు పెట్టిస్తున్న వీడియో

21 ఏళ్ల వయసులో రేణూ దేశాయ్ ఎలా ఉందో చూశారా?

అతి పెద్ద గుహలో చిన్న ప్రపంచం..వీడియో చూస్తే మతిపోవాల్సిందే గురూ!