Snake struck in net: చేపల వలలో చిక్కిన సర్పరాజ్.. బయటపడలేక అల్లాడిపోతున్న నాగుపాము..(వీడియో)
ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న భారీ నాగుపాముని రెస్క్యూ బృందాలు చాకచక్యంగా కాపాడాయి...ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం తాళ్లవలస గ్రామంలో చోటు చేసుకుంది...
ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న భారీ నాగుపాముని రెస్క్యూ బృందాలు చాకచక్యంగా కాపాడాయి…ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం తాళ్లవలస గ్రామంలో చోటు చేసుకుంది… పొలాల్లో ప్రమాద వశాత్తు ఓ పెద్ద నాగుపాము వలలో చిక్కుకుపోయింది. దాన్ని గమనించిన కొందరు స్థానికులు గ్రీన్ మెర్సీ స్నేక్ హెల్ప్ లైన్‌కి సమాచారం అందించారు. గ్రీన్ మెర్సీ, సేవ్ స్నేక్స్ సొసైటీ వెంటనే అటవీ శాఖని అప్రమత్తం చేసి, హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు.. వలలో దారుణంగా చుక్కుకుపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నాగుపామును సురక్షితంగా కాపాడి బయటకు తీశారు. రెస్క్యూ బృందాలకు నేతృత్వం వహించిన గ్రీన్ మెర్సీ సీఈఓ. కె. వి. రమణ మూర్తి నేర్పుగా వలని కత్తిరించి, ఆ పాముని రక్షించారు. అనంతరం గ్రామస్తులకు పాములపై అవగాహన కల్పించారు.
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?

