Car Bonnet: బోనెట్ నుంచి వింత శబ్దాలు.. ఏంటని తెరిచి చూడగా దెబ్బకు హడల్.. వీడియో వైరల్
పాము పేరు చెబితేనే చాలామంది భయపడతారు. అలాంటిది ఓ కింగ్ కోబ్రా మీకు తెలియకుండా కొన్ని కి.మీ. మీతోపాటు ప్రయాణించిందనుకోండి... అకస్మాత్తుగా అది మీకంట పడితే ఎలా ఉంటుంది.
పాము పేరు చెబితేనే చాలామంది భయపడతారు. అలాంటిది ఓ కింగ్ కోబ్రా మీకు తెలియకుండా కొన్ని కి.మీ. మీతోపాటు ప్రయాణించిందనుకోండి… అకస్మాత్తుగా అది మీకంట పడితే ఎలా ఉంటుంది. ఫ్యూజులు ఎగిరిపోతాయి కదా.. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది కర్నాటకలో. కర్ణాటకలోని మల్లాపూర్ ప్రాంతంలో 10 అడుగుల కింగ్‌కోబ్రా హల్‌చల్ చేసింది. ఓ వ్యక్తి తన కారులో జై సింగ్ కైగా ప్రాంతం నుంచి కార్వార్‌కు బయల్దేరాడు. ఇంతలో మార్గమధ్యలో మల్లాపుర్ సమీపంలో కాసేపు తన కారును ఆపాడు. ఆ సమయంలో అతడు బోనెట్ నుంచి వింత శబ్దాలు రావడాన్ని గుర్తించాడు. ఎప్పుడు దూరిందో గానీ.. 10 అడుగుల కింగ్ కోబ్రా అతడి కారు ముందుభాగంలో ప్రవేశించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అతడు.. అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాడు. అటవీ సిబ్బంది తక్షణం ఆ కారు ఉన్న చోటికి చేరుకొని దాదాపు 4 గంటల పాటు శ్రమించి పామును బయటకు తీశారు. అనంతరం దాన్ని సురక్షితంగా అడవిలో విడిచిపెట్టారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos