పెళ్లికూతురుని వెతకమని మ్యాట్రిమోనీకి వెళ్లిన వ్యక్తి.. తర్వాత ??

|

Nov 09, 2024 | 12:25 PM

పెళ్లి సంబంధం కుదర్చమని మ్యాట్రిమోనీ కంపెనీని ఆశ్రయించిన ఓ వ్యక్తి ఆ తర్వాత సదరు కంపెనీకి చుక్కలు చూపించాండు. పెళ్లికూతురిని వెతకడంలో విఫలమైన సదరు కంపెనీపై కేసు వేశాడు. దాంతో ఆ కంపెనీ అతనికి రూ.60 వేల రూపాయలు చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే... బెంగళూరుకు చెందిన కుమార్‌ అనే వ్యక్తి తన కుమారుడికి పెళ్లి సంబంధం కోసం ఓ మ్యాట్రిమోనీ కంపెనీకి వెళ్లాడు.

అక్కడ తన కుమారుడి వివరాలన్నీ ఇచ్చి వధువును వెతికిపెట్టమని కోరాడు. అందుకు సంస్థ కుమార్‌నుంచి ఇనిషియల్ పేమెంట్‌గా రూ.30 వేల రూపాయలు వసూలు చేసి, నెల రోజుల్లో సంబంధం చూస్తామని చెప్పారు. నెల రోజులైనా మ్యాట్రిమోనీ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కంపెనీకి వెళ్లి వివరాలు అడిగాడు. వారు ఏప్రిల్‌ నెలాఖరువరకూ ఆగాలని గడువు కోరారు. ఏప్రిల్‌ కూడా అయిపోయింది. అయినా మ్యాట్రిమోనీ నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతో కుమార్‌ మే నెలలో సదరు మ్యాట్రిమోనీ కంపెనీకి లీగల్‌ నోటీసులు పంపించాడు. కోర్టు నోటీసులకు కూడా కంపెనీ స్పందించకపోవడంతో బెంగళూరులోని వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. అక్టోబరు 28న న్యాయస్థానం సదరు మ్యాట్రిమోనీ సంస్థపై చర్యలు చేపట్టింది. కుమార్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. తాను ముందుగా చెల్లించిన సొమ్ముపై 6 శాతం వడ్డీతోపాటు నష్ట పరిహారంగా రూ.20,000 చెల్లించాలని ఆదేశించింది. కస్టమర్‌కు మానసిక వేదన కలిగించినందుకు రూ.5000, లీగల్‌ ఖర్చులకు మరో రూ.5000 చెల్లించాలని కంపెనీని కోర్టు ఆదేశించింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మా కుక్కను దొంగలెత్తుకెళ్లారు !! పోలీసులను ఆశ్రయించిన యజమాని

ఎడారి దేశం‌లో వింత.. మంచు దుప్పటిలో దుబాయ్‌

Puhspa 2: ఫస్ట్ రోజే రూ.270 కోట్లా !!

Puhspa 2: రిలీజ్ కాకముందే రికార్డులు సృష్టిస్తున్న పుష్ప 2

ఒకే స్టేజ్‌పై రెండు సింహాలు.. అస్సలు మిస్ అవ్వకండి