Viral Video: డచ్ యూట్యూబర్‌పై వ్యాపారి దాడి.. వీడియో వైరల్ కావడంతో వ్యాపారి అరెస్ట్ కు సిద్ధం.
డచ్ దేశానికి చెందిన ఓ యూట్యూబర్ బెంగళూరులో చిక్‌పేట్ వద్ద వీడియో రికార్డు చేస్తుండగా అతడిని అడ్డగించిన వ్యాపారి దౌర్జన్యం చేశాడు. హోల్‌సేల్, రిటైల్ దుస్తుల వ్యాపారానికి పేరు పొందిన చిక్‌పేట్‌లో యూట్యూబర్ వీడియో రికార్డు చేస్తుండగా స్దానిక వ్యాపారి అభ్యంతరం తెలిపి దురుసుగా వ్యవహరించాడు.
డచ్ దేశానికి చెందిన ఓ యూట్యూబర్ బెంగళూరులో చిక్‌పేట్ వద్ద వీడియో రికార్డు చేస్తుండగా అతడిని అడ్డగించిన వ్యాపారి దౌర్జన్యం చేశాడు. హోల్‌సేల్, రిటైల్ దుస్తుల వ్యాపారానికి పేరు పొందిన చిక్‌పేట్‌లో యూట్యూబర్ వీడియో రికార్డు చేస్తుండగా స్దానిక వ్యాపారి అభ్యంతరం తెలిపి దురుసుగా వ్యవహరించాడు. యూట్యూబర్ పెడ్రో మోటాను వ్యాపారి అడ్డగించి దురుసుగా వ్యవహరించాడు. యూట్యూబర్ నమస్తే పెడుతున్నా వినిపించుకోని వ్యాపారి నమస్తే ఎందుకు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ అంటూ అతడి చేయి పట్టుకుని గట్టిగా మెలితిప్పాడు. ఎట్టకేలకు వ్యాపారి పట్టు నుంచి విడిపించుకున్న యూట్యూబర్ ఎలాగోలా అక్కడినుంచి బయటపడ్డాడు. పెడ్రో ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. చిక్‌పేట్ క్లాత్ మార్కెట్ విశేషాలను తాను రికార్డు చేస్తుండగా స్ధానిక వ్యాపారి కోపంతో తన పట్ల దురుసుగా వ్యవహరించాడని ఆ పోస్ట్‌లో పెడ్రో రాసుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ విదేశీయుడి పట్ల స్థానిక వ్యాపారి అనుచిత ప్రవర్తనను నెటిజన్లు తప్పు పడుతున్నారు. ముదసిర్ అహ్మద్ అనే నెటిజన్ ఏకంగా బెంగళూరు పోలీస్‌కి వీడియోను ట్యాగ్ చేసి అతడిపై చర్య తీసుకోవాలని కోరాడు. దీంతో తాజాగా పోలీసులు స్థానిక వ్యాపారిని అరెస్ట్ చేసారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!