Teacher-Students: ఎం దొంగలు రా నాయన..! ఓల్డ్ స్టూడెంట్స్ అని నమ్మించి.. టీచర్ ఇంట్లో చొరబడి..
బైక్ తాళంచెవి, ఇంటి తాళం చెవి ఒకే కీ చైన్‌కి ఉన్నాయి. అది గమనించిన ఆ వ్యక్తులు నేరుగా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లారు. బీరువా తాళాన్ని పగలగొట్టారు. ఇంట్లో ఉన్న 30 లక్షలు నగదు, 10 తులాల బంగారాన్ని లూటీ చేశారు.
సంగారెడ్డి జిల్లాలో ఓ విచిత్ర సంఘటన జరిగింది. తాము ఓల్డ్ స్టూడెంట్స్ అని ఓ టీచర్‌తో పరిచయం పెంచుకుని ఇంట్లోని నగదు, బంగారం తీసుకుని ఉడాయించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో లక్ష్మీ నారాయణ ఉపాధ్యాయుడిగా పని చేసి రిటైర్ అయ్యారు. ఓ రోజు ఆయన మార్కెట్ యార్డు సమీపంలో మద్యం సేవిస్తున్నారు. ఆ సమయంలో అటు వైపు ఇద్దరు యువకులు వచ్చారు. తాము అతని ఓల్డ్ స్టూడెంట్స్ అని, అతని వద్దే పాఠాలు నేర్చుకున్నామని, గుర్తున్నామా మాస్టారూ.. అంటూ మాటలు కలిపారు. వీరి మధ్య చనువు ఏర్పడడంతో తరచూ కలిసి మద్యం తాగుతుండేవారు. ఈ క్రమంలో మద్యం తాగుతుండగా స్టఫ్ అయిపోయింది. తినేందుకు ఏమైనా తీసుకువస్తామని చెప్పి లక్ష్మీ నారాయణ బైక్ తీసుకువెళ్లారు.అయితే.. బైక్ తాళంచెవి, ఇంటి తాళం చెవి ఒకే కీ చైన్‌కి ఉన్నాయి. అది గమనించిన ఆ వ్యక్తులు నేరుగా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లారు. బీరువా తాళాన్ని పగలగొట్టారు. ఇంట్లో ఉన్న 30 లక్షలు నగదు, 10 తులాల బంగారాన్ని లూటీ చేశారు. కేవలం 14 నిమిషాల్లోనే వారు దొంగతనం పూర్తి చేసుకున్నారు. స్టఫ్ తెస్తామని వెళ్లినవాళ్లు ఎంతకీ రాకపోవడంతో లక్ష్మీ నారాయణ కంగారు పడ్డారు. ఇంటికి వెళ్లి చూసేసరికి ఇంటి తలుపు తాళం లేకుండా గడియ పెట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న డబ్బు, బంగారు నగలు కనిపించలేదు. వెంటనే సమీపంలోని పోలీసులకు కంప్లైంట్ చేశారు మాస్టారు. ఆ వ్యక్తులు తనకు రెండు నెలల క్రితం పరిచయమయ్యారని, తమది సంగారెడ్డి అని చెప్పారని, పేర్లు మాత్రం చెప్పలేదని పోలీసులకు చెప్పాడు. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బును ఇంట్లో దాచుకున్నాని, ఆ నగదుతో ప్లాట్ కొనుక్కుందామని భావించానని వివరించాడు. ఇంతలో ఇలా జరిగిందని బాధితుడు వాపోయాడు. అతని కంప్లైంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరా పుటేజీల ద్వారా నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నామని ఎస్ఐ వెల్లడించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!