Beggar Viral Video: భార్యకోసం మోటార్‌ బైక్‌ కొన్న భిక్షగాడు.. రోజుకి అతని సంపాదన ఎంతో తెలుసా..!

|

May 30, 2022 | 9:24 AM

మధ్యప్రదేశ్‌లో ఓ బిచ్చగాడు తన భార్య కోసం ఏకంగా 90 వేలు పెట్టి బైక్‌కొన్నాడు. చింద్వారా జిల్లా కేంద్రంలో ఓ వృద్ధ దంపతులు మూడు చక్రాల సైకిల్‌పై తిరుగుతూ భిక్షాటన చేసుకునేవారు.


మధ్యప్రదేశ్‌లో ఓ బిచ్చగాడు తన భార్య కోసం ఏకంగా 90 వేలు పెట్టి బైక్‌కొన్నాడు. చింద్వారా జిల్లా కేంద్రంలో ఓ వృద్ధ దంపతులు మూడు చక్రాల సైకిల్‌పై తిరుగుతూ భిక్షాటన చేసుకునేవారు. ఈ భిక్షగాడికి కాళ్లలో వైకల్యం ఉండటంతో మూడు చక్రాల సైకిల్ పై కూర్చుని హ్యాండిల్ పట్టుకుంటే.. అతడి భార్య సైకిల్ ను వెనుక నుంచి నెట్టేది. కాలక్రమంలో ఈ దంపతుల వయసు 60కు దగ్గర పడింది. అయితే, వయసు పెరగడం, కచ్చా రోడ్లు, ఎత్తయిన చోట్ల సైకిల్ ను తోయాల్సి రావడంతో అతని భార్య అనారోగ్యం పాలైంది. వెన్నునొప్పితో బాధపడుతుండటంతో వారికి భిక్షాటన భారంగా మారింది. భార్య బాధను చూడలేకపోయిన అతను ఇంతకాలం భిక్షాటనతో కూడబెట్టుకున్న సొమ్ముతో 50 వేలు ఖర్చు చేసి భార్యకు వైద్యం చేయించాడు. మరో 90 వేల రూపాయలు ఖర్చుపెట్టి మూడు చక్రాల మోటారు వెహికల్‌ను కొన్నాడు. దీంతో అతని భార్యకు బండిని తోసే పని తప్పింది. దాంతో ఇద్దరూ కలిసి సులభంగా ఎక్కడికైనా వెళ్లి భిక్షాటన చేసుకునే అవకాశం కలిగింది. మోటారు వాహనం కొన్న తర్వాత వారు భిక్షాటన కోసం ఎంతదూరమైనా వెళ్లగలుగుతున్నామని ఆనందంగా చెబుతున్నాడు ఆ భిక్షగాడు. రోజుకు 300 నుంచి 400 రూపాయల వరకూ సంపాదిస్తున్నామని చెప్పాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్‌ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్‌..!

Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?

Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!

Published on: May 30, 2022 09:24 AM