Sheep Viral Video: గొర్రెకు మూడేళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు..! ఎందుకో , ఎక్కడో తెలుసా..?
మన దేశంలో ఎవరైనా నేరానికి పాల్పడితే.. పక్కాగా ఆధారాలు, సాక్ష్యాలు ఉండి.. నేరం రుజువైతే గానీ నిందితుడికి శిక్ష పడదు. ఇక, ప్రమాదవశాత్తు ఏ జంతువు దాడిలో మనిషి చనిపోతే పట్టించుకునే వాడే ఉండడు. మహా అయితే...
మన దేశంలో ఎవరైనా నేరానికి పాల్పడితే.. పక్కాగా ఆధారాలు, సాక్ష్యాలు ఉండి.. నేరం రుజువైతే గానీ నిందితుడికి శిక్ష పడదు. ఇక, ప్రమాదవశాత్తు ఏ జంతువు దాడిలో మనిషి చనిపోతే పట్టించుకునే వాడే ఉండడు. మహా అయితే సదరు జంతువు యజమాని మంచివాడైతే నష్టపరిహారంగా ఎంతో కొంత ఇస్తేరేమో గానీ ఎక్కువ శాతం మంది తప్పించుకునేందుకే చూస్తారు. కానీ ఆఫ్రికాలో ఒక జంతువు మనిషిని దాడి చేసి చంపినందుకు మూడేళ్లు జైలు శిక్ష విధించింది.దక్షిణ సూడాన్‌లో రామ్ అనే గొర్రె 45 ఏళ్ల అదీయు చాపింగ్‌పై దాడి చేసింది. దీంతో ఆమె గాయాలపాలై మరణించింది. ఈ ఘటన రుంబెక్ ఈస్ట్‌లోని అకుయెల్ యోల్ అనే ప్రదేశంలో జరిగింది. పోలీసులు రామ్ అనే గొర్రెని అదుపులోకి తీసుకోవడమే కాకుంగా కస్టమరీ కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసును విచారించిన కోర్టు.. రామ్ అనే గొర్రెకి మూడేళ్లు జైలు శిక్ష విధిచింది. అంతేకాదు, ఈ గొర్రె యజమాని డుయోని మాన్యాంగ్ బాధితురాలి కుటుంబానికి ఐదు ఆవులు అప్పగించాలని తీర్పు ఇచ్చింది. శిక్షలో భాగంగా ఈ గొర్రె ప్రస్తుతం లేక్స్ స్టేట్‌లోని సైనిక శిభిరంలో గడుపుతున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
Ratlam Temple: ఆ గుడికి వెళ్తే.. బంగారం ఫ్రీ..! భక్తులకు ప్రసాదంగా బంగారు, వెండి నాణాలు.. ఎక్కడంటే.?
Child cooking: ఈ బుడ్డోడు గరిటపడితే బాల భీముడే.. బుడతడి వంటకు నెటిజన్లు ఫిదా..!