Viral: ఇంత పెద్ద అరటిగెలని జీవితంలో చూసి ఉండరు.. ఎన్ని కాయలో తెల్సా

Viral: ఇంత పెద్ద అరటిగెలని జీవితంలో చూసి ఉండరు.. ఎన్ని కాయలో తెల్సా

Phani CH

|

Updated on: Jul 23, 2022 | 8:42 PM

కోనసీమ జిల్లా మల్కిపురం మండలం దిండి గ్రామంలో బాహుబలి అరటి గెల అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా అరటి గెలకు ఐదు నుండి ఎనిమిది హస్తాలు ఉంటాయి.

కోనసీమ జిల్లా మల్కిపురం మండలం దిండి గ్రామంలో బాహుబలి అరటి గెల అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా అరటి గెలకు ఐదు నుండి ఎనిమిది హస్తాలు ఉంటాయి. కానీ దిండి గ్రామ సర్పంచ్ ముదునూరి శ్రీనివాస్ రాజు పెరట్లో ఓ అరటి గెల మాత్రం అబ్బురపరుస్తుంది. ఇటువంటి అర‌టి గెల‌ను ఇప్పటివరకూ చూసి ఉండ‌రు. ఎందుకంటే ఆరడుగుల పొడవున్న ఆ గెలకు 80 హస్తాలు, 3,000 కాయలు ఉన్నాయి. దీంతో ఈ క్రేజీ అరటి గెలను చూసేందుకు స్థానికులు క్యూ కడుతున్నారు. ఈ అరటి గెలతో ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నారు. గెల చుట్టూ అరటి కాయలతో విరగకాసింది. దీంతో ఈ అర‌టి గెల‌కు బాహుబ‌లి బ‌నానా అని పేరు పెట్టారు. అరటి గెల భారీగా పెరగటంతో బరువుకు చెట్టు విరగకుండా గెడలు సపోర్ట్‌గా పెట్టారు. ఇది సింగపూర్ ఆల్మండ్ కర్పూర రకం అరటి అని.. మలేషియా నుంచి పిలకను ప్రత్యేకంగా తెప్పించినట్లు శ్రీనివాసరాజు తెలిపారు. బాహుబ‌లి అరటి గెల‌ ఫోటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Aparna Balamurali: ఉత్తమ నటిగా నేచురల్ బ్యూటీ అపర్ణ..

Thankyou: ‘వదులుకున్న ప్రేమలు.. వదిలేసుకున్న జీవితాలు’ అందర్నీ కదిలిస్తున్న థాంక్యూ

ప్రేమ విఫలమై.. ఐఏఎస్‌ కావలసినవాడు పిచ్చివాడయ్యాడు

Viral: ఐస్‌క్రీమ్‌ కోసం శునకం కష్టాలు.. ఎంత లాగినా రాదాయే

జీపు బానెట్ పై కూర్చున్న వ్యక్తి !! ఎదురుగా అనుకోని అతిథి ప్రత్యక్షం !!

Published on: Jul 23, 2022 08:42 PM