భారీగా ట్రాఫిక్ జామ్.. ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై దూసుకెళ్లిన ఆటో
మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యల గురించి అందరికీ తెలిసిందే. ఈ ట్రాఫిక్‌నుంచి తప్పించుకోడానికి వాహనదారులు ఒక్కోసారి ఫుట్‌పాత్‌లపైనుంచి కూడా వాహనాలు నడుపుతూ వెళ్తుంటారు. దాంతో నడిచి వెళ్లేవారినే కాకుండా వాహనదారులనూ ప్రమాదంలో పడేస్తుంటారు. అలాంటి ఎన్నో సంఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా ఓ ఆటోడ్రైవర్ ఎవరూ చేయని ప్రమాదకరమైన పని చేశాడు. ట్రాఫిక్‌నుంచి తప్పించుకోడానికి ఏకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైనుంచి ఆటోను తోలుకుంటూ వెళ్లాడు.
మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యల గురించి అందరికీ తెలిసిందే. ఈ ట్రాఫిక్‌నుంచి తప్పించుకోడానికి వాహనదారులు ఒక్కోసారి ఫుట్‌పాత్‌లపైనుంచి కూడా వాహనాలు నడుపుతూ వెళ్తుంటారు. దాంతో నడిచి వెళ్లేవారినే కాకుండా వాహనదారులనూ ప్రమాదంలో పడేస్తుంటారు. అలాంటి ఎన్నో సంఘటనలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా ఓ ఆటోడ్రైవర్ ఎవరూ చేయని ప్రమాదకరమైన పని చేశాడు. ట్రాఫిక్‌నుంచి తప్పించుకోడానికి ఏకంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైనుంచి ఆటోను తోలుకుంటూ వెళ్లాడు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆటోడ్రైవర్ తీరుకు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ సమస్య తప్పించుకునేందుకు అతడు ఏకంగా ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్‌పై ఆటోను తోలాడు. ఆ సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేరు. మరో వ్యక్తి సాయంతో అతడు ఆటోను మెట్లపై ఎక్కించాడు. ఆ తరవాత ఆటోవాలా స్నేహితుడు కూడా అందులోకి ఎక్కి తుర్రుమని వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ దారుణానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్‌ను మున్నాగా పోలీసులు గుర్తించారు. అతడి ఆటోను సీజ్ చేయడంతో పాటూ నిందితుడిని, అతడికి సహకరించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రపంచంలోనే అత్యంత పొడవైన జడ ఆమెసొంతం
ఇస్రోలో విషాదం.. సైంటిస్ట్ హఠాన్మరణం !! ఎలాగంటే ??
ఊరికి వెలుగునిచ్చేందుకు.. ప్రాణాలే ఫణంగా పెట్టిన లైన్‌మెన్
ఐదో ప్రియుడితో ముగ్గురు పిల్లల తల్లి పరార్.. పోస్టర్‌తో పిల్లల వెదుకులాట !!
రెప్పపాటులో తప్పించుకుంది.. లేదంటే క్షణాల్లో నూకలు చెల్లేవి
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

