రోడ్డుపై కూర్చుని ఏడుస్తున్న మహిళ.. గమనించిన ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ??
మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తుంటారు కొందరు వ్యక్తులు. కొందరైతే సాయం చేస్తున్నట్లు నటిస్తూ చివరికి దారుణాలకు తెగబడుతుంటారు. అయితే మహిళలకు సాయం చేసి, అందరితో శభాష్ అని అనిపించుకునే వారు కూడా ఉంటారు.
మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే చూస్తుంటారు కొందరు వ్యక్తులు. కొందరైతే సాయం చేస్తున్నట్లు నటిస్తూ చివరికి దారుణాలకు తెగబడుతుంటారు. అయితే మహిళలకు సాయం చేసి, అందరితో శభాష్ అని అనిపించుకునే వారు కూడా ఉంటారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట చోటు చేసుకుంటూనే ఉంటాయి. ప్రస్తుతం ఓ ఆటో డ్రైవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కుక్కను పట్టుకుని రోడ్డుపై ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్న మహిళకు సాయం చేసి శభాష్ అనిపించుకున్నాడు ఓఆటో డ్రైవర్. అసలేం జరిగిందంటే.. ఓ మహిళ తన పెంపుడు కుక్కకు వైద్యం చేయించేందుకు ఆస్పత్రికి వెళ్లింది. చికిత్స చేయించిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లేందుకు రోడ్డు పైకి వచ్చింది. అయితే కుక్కను చూసి ఆమెను ఎవరూ ఆటో ఎక్కనివ్వలేదు. చాలా సేపు ప్రయత్నించినా ఎవరూ ఆటోలో ఎక్కించుకోలేదు. దీంతో రోడ్డుపై కూర్చుని ఏడుస్తూ ఉంది. అదే సమయంలో అటుగా వచ్చిన మరో ఆటో డ్రైవర్ మహిళను గమనించి, విషయం అడిగి తెలుసుకున్నాడు. ‘‘నాకు జంతువులంటే చాలా ఇష్టం.. నా ఆటో ఎక్కమ్మా!.. నిన్ను క్షేమంగా ఇంటి వద్ద దింపుతా’’.. అని ధైర్యం చెప్పాడు. అతడి మాటలు నమ్మిన మహిళ.. కుక్కను తీసుకుని ఆటో ఎక్కింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నడిరోడ్డుపై రెచ్చిపోయిన గాడిద.. మనిషి అని కూడా చూడలే.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
పెళ్ళి పీటల నుంచి నేరుగా జైలుకు.. కోర్టు ఆవరణలోనే పెళ్లి.. అసలు ఏం జరిగిందంటే ??
పిచ్చి పీక్స్ అంటే ఇదే.. భర్తపై అమితమైన ప్రేమ.. ఆ మహిళ ఏంచేసిందో చూడండి..
కారు బ్యానెట్‌పై కూర్చుని యువతి రీల్స్.. తర్వాత ఏం జరిగింది ??
తిమింగలం వాంతి .. రూ. 30 కోట్లు.. దానికి ఎందుకంత డిమాండ్ ??