Banana Tree: అరటిగెల మీద పడ్డందుకు రూ.4 కోట్ల నష్ట పరిహారం..! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. (వీడియో)
ఓ అరటి తోటలో పనిచేసే కార్మికుడిపై అరటి చెట్టు పడటంతో యాజమానిపై దావా వేసి ఏకంగా 4 కోట్లు రాబట్టాడు. ఈ ఆశ్యర్యకర ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.క్వీన్స్‌ల్యాండ్ సమీపంలోని ఎల్ అండ్ ఆర్ కాలిన్స్‌కు చెందిన అరటి తోటలో జైర్ లాంగ్ బాటమ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు.
ఓ అరటి తోటలో పనిచేసే కార్మికుడిపై అరటి చెట్టు పడటంతో యాజమానిపై దావా వేసి ఏకంగా 4 కోట్లు రాబట్టాడు. ఈ ఆశ్యర్యకర ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.క్వీన్స్‌ల్యాండ్ సమీపంలోని ఎల్ అండ్ ఆర్ కాలిన్స్‌కు చెందిన అరటి తోటలో జైర్ లాంగ్ బాటమ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు.కాపుకు వచ్చిన చెట్లనుంచి అరటి పండ్ల గెలలను నరుకుతుండగా ప్రమాదవశాత్తు అరిటి పండ్ల గెలతో పాటు అరటి చెట్టుకూడా అతనిపై పడింది. దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దెబ్బలు తీవ్రంగా తగలటంతో లాంగ్ బాటమ్ వికలాంగుడైపోయాడు. ప్రమాదం కారణంగా పనిచేయలేక ఉపాధి కోల్పోయాడు. దీంతో బాధితుడు తనకు పరిహారం కోరుతూ అరటితోట యజమానిపై క్వీన్స్‌ల్యాండ్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాడు. ఇది 2016లో జరిగింది.
ఈ పిటీషన్‌పై కోర్టు విచారణ ఐదేళ్ళు కొనసాగింది. తాజాగా మరోసారి ఈ కేసుపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అరటి పండ్ల గెల మీద పడటం కారణంగానే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని, ఆ ఘటన వల్లనే అతను జీవితాంతం ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని కోర్టు అభిప్రాయపడింది.. కాబట్టి ఆ కూలీకి యజమాని 5,02,740 డాలర్ల పరిహారాన్ని అంటే భారత కరెన్సీలో 37, 71, 5630 రూపాయలను చెల్లించాలని అరటి తోట యజమానిని కోర్టు ఆదేశించింది. ఇలా క్వీన్స్‌లాండ్ సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో చేసేందేంలేక సదరు యజమాని కూలీకి పూర్తి నష్టపరిహారం చెల్లించాడు.
మరిన్ని చదవండి ఇక్కడ : NASA (Know this): నాసా కీలక నిర్ణయం.. సౌరవ్యవస్థలో కొత్త ప్రయోగం.! కానీ సైంటిస్టుల మాటేంటి..?(వీడియో)